త్రిబుల్ ఆర్ పచ్చి బూటకం

జనం సాక్షి భువనగిరి ( నవంబర్ 20) రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో ప్రతిపక్ష నాయకులు అమాయక ప్రజలను భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పై రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సోమవారం రోజు నా పట్టణంలోని ఒక హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులు ఎమ్మెల్యే హస్తం ఉందని ప్రతిపక్ష నాయకులు కుట్రపూరిత, అసత్య ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు 27 నియోజకవర్గాల పరిధి నుంచి వెళ్లే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని, వాస్తవ పరిస్థితులు రాయగిరి లో ఉన్న భూ బాధితులకు వివరిస్తామని ,ఎమ్మెల్యేకు సంబంధం లేదని సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ,రైతు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, ఎడ్ల రాజిరెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు.

బిజెపి నుండి బారాసలో చేరిక:

త్రిబుల్ ఆర్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో జైలుకు వెళ్లి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త రాయగిరి నివాసి అయిన మల్ల బోయిన బాల నరసింహ బారాసాలు చేరారు. స్థానిక ఎమ్మెల్యే భువనగిరి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి సోమవారం రోజున ఆయనకు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి గుంట భూమి కూడా లేదని ఎమ్మెల్యే పై పుట్టపూరితంగా తప్పుడు సమాచారం ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారని ఇట్టి విషయాలు రైతులు, స్థానిక ప్రజలు నమ్మవద్దు అన్నారు.