త్వరలో తెలంగాణపై నిర్ణయం

తెలంగాణ ప్రజల మనోభావాలను , ఉద్యమాలను గౌరవిస్తున్నాం
ధర్మన్నను వివరణ కోరాం.. ఆ తర్వాతే ఆయన రాజీనామాపై నిర్ణయంఔ
మహబూబ్‌పర్యటనలో ముఖ్యమంత్రి
మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నా మని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలోనే నిర్ణయం తీసుకుం టుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటిదాకా అందరూ వేచి చూడాల్సిందేనని చెప్పారు. రాజీనామా చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరణ కోరామని సీఎం వెల్లడిం చారు. వివరణ అందగానే ధర్మాన రాజీనామా వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని తెలి పారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ ఇందిరమ్మ బాటలో భాగంగా శనివారం రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులు, చేనేత కార్మికులు, రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఉదయం గద్వాలలోరాజీవ్‌ గృహకల్ప సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో భేటీ అయ్యారు. చదువు, విద్యాసంస్థల్లో వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్య కోసం ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంటుందో కిరణ్‌ వివరించారు. ఫీజురీయింబర్స్‌ మెంట్‌ కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున జై తెలంగాణ నినాదాలు చేయడంతో సీఎం స్పందించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించామని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవి స్తున్నా మని చెప్పారు. అయితే, తెలంగాణ అంశం చాలా సున్నితమైనదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 50 ఏళ్ల నుంచి సుదీర్ఘ ఉద్యమం
తాను పాటిస్తానని తెలిపారు. ధర్మాన రాజీనామా వ్యవహారంపై ముఖ్యమంత్రి తొలిసారిగా స్పందించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. సీబీఐ చార్జిషీట్‌లో పేరు చేర్చిన విషయంపై ధర్మాన నుంచి వివరణ కోరామని తెలిపారు. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత రాజీనామాపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కళినేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌ తెలిపారు. గద్వాల్‌ రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని అంగీకరించారు. వారికి కనీస కూలీ గిట్టుబాటు కావడం లేదన్నారు. చేనేత వృత్తి ఎలా కొనసాగించాలో ఎవరైనా సూచనలు చేయవచ్చని, వృత్తిలో సమస్యలు అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేత కార్మికులకు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. రుణాలు, యంత్రాలపై సబ్సిడీ అందిస్తున్నామని వివరించారు.