త్వరలో రైలు ఛార్జీలు పెంచే ప్రతిపాదన : మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌

రాజమండ్రి : రైల్వే ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల  సూర్యప్రకాశ్‌ రెడ్డి అన్నారు. త్వరలో రైలు ఛార్జీలు పెంచే ప్రతిపాదన ఉందని ఆయన రాజమండ్రిలో వెల్లడించారు. రైల్వే భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వైకాపాపై విమర్శలు గుప్పించారు. వైకాపాకు నాయకులే లేరని.. ప్రస్తుతం పార్టీకి నాయకత్వం వహిస్తున్నది ఎవరో చెప్పాలని ఆయన సవాలు విసిరారు.