త్వరితగతిన బోడు భూముల సర్వే పూర్తి చేయాలి
— భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
టేకులపల్లి, అక్టోబర్ 12( జనం సాక్షి): త్వరితగతిన బోడు భూముల సర్వేలు తక్షణమే పూర్తి చేయాలని స్థానిక అధికారులన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. టేకులపల్లి మండలం గోలియా తండ గ్రామపంచాయతీ నందు జరుగుచున్న పోడు భూముల సర్వేను అకస్మికంగాబుధవారం తనిఖీ చేశారు. గొలియ తండా పంచాయితీకి చెందిన రైతు యొక్క భూమి సరిహద్దులను స్వయంగా మొబైల్ యాప్ ద్వారా పరిశీలించారు. సర్వే చేయుటలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సర్వే టీం సిబ్బంది కమీటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ సర్వేను గురువారం ఉదయం వరకు త్వరగా ప్రారంభించి సాధ్యమైనంత ఎక్కువ భూములు సర్వేను చేసి పూర్తి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూముల సర్వేను రైతులు, సర్వే టీం , ఎఫ్ఆర్సి కమిటీ సమన్వయంతో త్వరగా పూర్తిచేయాలని ఎటువంటి అవతవకలకు జరుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి అడవిని నరికినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సర్వేను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. సర్వే ప్రక్రియ ఎలా జరుగుతుందని అటవీ హక్కుల చట్టం కమిటీ సభ్యులను, సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోలియా తండా, టేకులపల్లి గ్రామ సర్పంచులు బోడ నిరోషా, సరిత, టేకులపల్లి మండలం మండల పరిషత్ అభివృద్ధి అధికారి దుద్దుకూరి బాలరాజు, తాహశీల్దారు కెవి శ్రీనివాస రావు, మండల పంచాయతీ అధికారి ఎల్ జి గాంధీ, ఎఫ్ఆర్ఓ ముక్తార్ పాష , ఏపీఓ కె శ్రీనివాస్, కార్యదర్శులు ప్రశాంత్, గోపాలకృష్ణ, కిరణ్, అజయ్ అటవీ శాఖ, ఉపాధి హామీ సిబ్బంది, రైతులు, పాల్గొన్నారు.