థానే ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య
థానే : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. 60 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం థానేలోని షీల్ థాయ్‌గర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడుంతస్తుల భవనం కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 12 అగ్నిమాపక శకటాలు, 24 అంబులెన్స్‌లతో ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ఈ భవంతికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు.