థాయ్‌లాండ్ ఓపెన్ విజేత సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ థాయిలాండ్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో సైనా థాయ్‌లాండ్‌కు చెందిన రచనోక్ ఇంతాన్‌స్‌పై విజయం సాధించింది. 19-21, 21-15, 21-10 తేడాతో సైనా గెలిచింది.ఫైనల్‌కు ముందు నుంచే సైనా సత్తా చాటుతోంది. ప్రి గోల్డ్ కైవసం చేసుకోవడం సైనాకు ఇదే ప్రథమం కాగా, ఈ ఏడాదిలో టైటిల్ గెల్చుకోవడం రెండవది.