దండం పెడతా.. లారీలను జాగ్రత్తగా నడపండి

జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్

జనంసాక్షి, మంథని : మంథని మండలం పుట్టపాక గ్రామంలో మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి పై లారీ లను జాగ్రత్తగా నడపాలని డ్రైవర్ల కు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిచడం వలన దొరికే ఇసుక వృధా పోకుండా ప్రభుత్వం తీసి ప్రజలకు ఇసుక తక్కువ ధర కు దొరికే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి లో భాగంగా ఇసుక ను తీస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఎక్కువ లారీలు తిరుగుతుండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సీపీ సత్యనారాయణ నేతృత్వంలో ప్రజాప్రతినిధుల కు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి ఇసుక కోసం మంథని ప్రాంతానికి వస్తున్న లారీ డ్రైవర్ల కు, ఓనర్ల కు రెండు చేతులు జోడించి ,శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్న లారీలను జాగ్రత్తగా నడపండి. ఈ రోజు ప్రాంతానికి అను నిత్యం వస్తున్నటువంటి లారీ డ్రైవర్ల కు, ఓనర్ల కు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేసి ఒక్క కుటుంబం రోడ్డు మీద పడితే ఆ కుటుంబాని ఎవరు కూడా ఆదుకోలేరన్నారు