దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ విజయం!
లండన్ : ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా లండన్ లో జరిగిన తొలి సెమిఫైనల్స్ లో దశ్రీఇణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది, 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 37.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో అత్యధికంగా ట్రాట్ 82, రూట్ 48, బెల్ 20, మోర్గాన్ 15 పరుగులు చేశారు. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంలో తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాలో మిల్లర్ అత్యధికంగా 56, పీటర్సన్ 30, ప్లెసిస్ 26, క్లెయిన్ వెల్డ్ 43 పరుగులు చేఊశారు. బ్రాడ్, ట్రెడ్ వెల్ మూడేసి వికెట్లు, అండర్సన్ 2, ఫిన్ 1 వికెట్ పడగొట్టారు.