దమ్మపేట మండలంలో ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి
ఖమ్మం: దమ్మపేట మండలంలోని ఖమ్మం,పశ్చిమగోదావరి సరిహద్దుగ్రామమైన వడ్ల గ్రామంలో ట్రాక్టర్‌బోల్లాపడి దుర్గారావు(25)మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం అగ్రహరానికి చెందిన ఓ రైతు ఆదివారం సాయంత్రం దుక్కిదున్ని ట్రాక్టర్‌తో తిరిగి వస్తుండగా అదుపుతప్పి ఉదృతంగా ప్రవహిస్తున్న అలుగులో బోల్తాపడింది. దీంతో దుర్గారావు(25)మృతి చెందాడు. ఈ రోజు ఉదయం ట్రాక్టరును ప్రోక్లెయినర్ సహయంతో బయటకు తీయగా అతని మృతదేహం బయటపడింది.