దమ్ముంటే పార్లమెంట్‌ రద్దు చేసి ఎన్నికలకు రండి

జమిలి ఎన్నికల జ్వరంపై కాంగ్రెస్‌ సవాల్‌

అసెంబ్లీలతో పాటే లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని సూచన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): జమిలి ఎన్నికలపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ విసిరింది. ఓ వైపు ఈ ఎన్నికలు అసధ్యమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పన నేపథ్యంలో కాంగ్రెస్‌ మరో అడుఉగ వేసి దమ్ముంటే పార్లమెంట్‌ రద్దు చ ఏసి ఎన్నికలకు రావాలని సవాల్‌ చేసింది. లోక్‌సభను రద్దు చేసి, ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటు ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు వీటికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అశోక్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదనీ… మిజోరాం, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ కాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలకు ఒక్కటే మార్గం. ప్రధానమంత్రి లోక్‌సభను రద్దు చేసి, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్‌ దీన్ని స్వాగతిస్తుంది. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం అని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో కలిపి ఈ నాలుగు రాష్ట్రాలు సహా మొత్తం 12 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా డిమాండ్‌ చేసిన మరుసటి రోజే గెహ్లాట్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

జమిలిని వ్యతిరేకించిన నితీశ్‌

లోక్‌సభ, శాసన సభల ఎన్నికలు ఒకేసారి జరగాలంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ షాక్‌ ఇచ్చారు. నితీశ్‌ మంగళవారం మాట్లాడుతూ ‘ఒకే దేశం – ఒకేసారి ఎన్నికలు’ సాధ్యం కాదన్నారు. లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఈసారి

సాధ్యం కాదన్నారు. సిద్దాంతపరంగా ఇది సరైనదవుతుందన్నారు. బిజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బిహార్‌లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ దీనిని వ్యతిరేకించడం విశేషం. ఎన్డీయేలోని శిరోమణి అకాలీదళ్‌తోపాటు ఏఐఏడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌, డీఎంకే, టీడీపీ, వామపక్షాలు, జేడీఎస్‌ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.