దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగు

రామారెడ్డి   జులై 22  జనంసాక్షీ
దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగుచేయలని ఏవో హరీష్ కుమార్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,
పత్తి, మొక్కజొన్న, జొన్న మొదలగు ఆరుతడి పంటలు సాగుచేసినట్లుగానే వరి పంటను దమ్ము చేయని నేలల్లో నేరుగా విత్తి సాగు చేసే పద్ధతి ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందితున్నదని అన్నారు. . ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో కొన్ని వేల ఎకరాలలో రైతాంగం ఈ పద్ధతిని పాటిస్తు న్నారని చెప్పారు. .ముఖ్య సూచనలు: తొలకరి వర్షాలతో మొలకెత్తిన గత సీజను వరి విత్తనాలను భూమిలో దున్ని దుక్కి చేసుకోవాలి. సరైన దుక్కు లు చేసుకొని ఎకరాకు 10-12 కిలోల విత్తనం విత్తుకోవాలి / చల్లుకోవాలి. విత్తిన 48 గంటల లోపు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకో వాలి. సాధారణంగా వానాకా లం వర్షాలు వరి పంటకు సరిపోతాయి. కానీ వారం రోజులు కన్న ఎక్కువ బెట్ట ఉంటే నీటి తడులు ఇవ్వాలి.
కలుపు 2-4 ఆకు దశలో ఉన్నప్పుడు ట్రయాఫా మెన్  ఇథాక్సిసల్ఫ్యూరాన్ 90 గ్రా. లేదా పెనాక్సు లమ్ సైహలోఫాస్ బ్యూటైల్ 800మి.లీ./ ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. పిలక దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఒక ఇంచు, పూత దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు రెండు ఇంచుల నీరు నిల్వ ఉంచాలి. ప్రయోజనాలు : వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకొని, సకాలంలో వారిని విత్తుకోవడం తద్వారా యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవడానికి అనువైన వాతావరణం కలిగి ఉంటుంది. నారుమడి పెంచే ఖర్చు లేదు. నాటు వేయవలసిన అవసరం లేదు. విత్తన మోతాదు సగానికి సగం తగ్గించవచ్చు. తద్వారా ఎకరాకు రూ. 7000 ఆదా అవుతుంది. నేరుగా విత్తుకు న్నప్పుడు వరి వారం నుండి పది రోజులు ముందుగా కోతకు వస్తుంది.  విలువైన నీరును (25-30 శాతం) ఆదా చేసుకోవచ్చు.  ఈ పద్ధతి కాలువలు, పెద్ద చెరువుల కింద సాగుకు అత్యంత అనుకూలం అని చెప్పారు. మండల ప్రజలు రైతు బీమ చేయించుకొని వారు ఏఈఓల వద్దకు వెళ్లి రైతు బీమ , ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవలన్నారు. ఆగష్టు 1వ తారిఖు వరకు మాత్రమే సడలింపు ఉంటుందని అన్నారు. ఈకార్యక్రమంలో ఏఈఓ ప్రతిమ , సాయిలు రైతులు తదితరులు పాల్గొన్నారు.