దయన్న ప్రజా జీవితానికి 40 ఏళ్లు….. పుస్తకావిష్కరణ చేసిన జలగం శేఖర్
లక్షలాదిమంది ప్రేమను గుండెలో నింపుకున్న ఓట మెరుగని నాయకుడు..
బుడిబుడి నడకలు వేస్తున్న రాజకీయ నాయకులకు ఆదర్శం దయన్న
పెద్దవంగర ఆగస్టు 29(జనం సాక్షి )సోమవారం తొర్రూరు జెడ్ పి ఎస్ ఎస్ హై స్కూల్లో జరిగిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ లో భాగంగా పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి “ఎర్రబెల్లి దయాకర్ రావు 40 సంవత్సరాల రాజకీయ అభివృద్ధి ప్రస్థానం” పుస్తకాన్ని పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామానికి చెందిన జలగం శేఖర్, పాలకుర్తి నియోజకవర్గం టీవీ ఫైవ్ రిపోర్టర్ రచించిన పుస్తకం ఆవిష్కరించారు. తను స్వయంగా ఈ పుస్తకం రచించి తన అభిమానాన్ని తెలియజేస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయంగా ఎదుర్కొన్నటువంటి ఎన్నో కష్టసుఖాలను తెలియజేస్తూ, తన దాంపత్య జీవితాన్ని వివరిస్తూ, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన తన ఓట మెరుగని జీవితాన్ని వర్ణిస్తూ, దయన్న అడుగుపెట్టిన ఎ ప్రాంతమైన అయినా , సస్యశ్యామలంగా, పచ్చని పంట పైరులతో , ప్రజలు ఆనందంగా ఉంటారు అని వర్ణిస్తూ, ప్రజలకు మంచి సందేశాన్ని పంపించారు , మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నమ్ముకున్న ఏ ప్రాంత ప్రజలైన కార్యకర్తలైన ప్రజా ప్రతినిధులైన ఎవరైనా సరే అభివృద్ధి పథంలో ఉంటూ ఆనందంగా ఉంటారని వర్ణించారు. మంత్రి దయన్న నీళ్ల కోసం కొట్లాడే ఉద్యమకారుడని, ప్రజల కోసం కొట్లాడె ప్రజానాయకుడని, వర్ణిస్తూ తన అభిమానాన్ని మాటల్లో చెప్పలేక పుస్తకం రూపంలో తెలియజేశాడు ఈ సందర్భాన్ని తన ఆనందంతో తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తన అభిమానాన్ని తన గుండెలో దాచుకొని మాటల్లో కాక పుస్తకంలో వర్ణించనని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ బిఆర్ లెనిన్ మరియు దూలం శ్రీనివాస్ స్థానిక ఎంపీపీ జడ్పిటిసి, కార్యకర్తలు, నాయకులు, పత్రికా విలేకరులు తదితరులు పాల్గొన్నారు