దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించాలి.
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 10(జనం సాక్షి)
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెరిగిన ధరల అనుగుణంగా మేస్ కాస్మోటింగ్ చార్జీలు పెంచాలి అన్నారు. సంక్షేమ హాస్టలోని విద్యార్థులకు నెలకు కేవలం 1500 మెస్ బిల్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీని వలన విద్యార్థులకు ఏ విధంగా పౌష్టిక ఆహారం అందుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యవసర సరుకులు ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని అందుతున్న కానీ సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం మెస్ బిల్లులు పెంచకుండా విద్యార్థుల పైన ఎందుకు ఇంత చిన్న చూపుచూస్తున్నారని విమర్శించారు. దీనివలన విద్యార్థులకు గతంలో ఉన్న మేను ను మార్చి విద్యార్థులకు రావలసిన కోడిగుడ్లు, అరటి పండు, బిస్కెట్లు తగ్గించిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు సంక్షేమ మంత్రులు ఉన్నా కానీ ఏ ఒక్కరోజు కూడా సంక్షేమ హాస్టల్లో సందర్శించిన దాఖలాలు లేవు. ఉత్తర తెలంగాణలోని జిల్లాలోని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కరీంనగర్ కి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కళాశాల హాస్టల్ ఉంటాయని ఎన్నో ఆశలతో విద్యార్థులు కరీంనగర్ కు వస్తే వారికి నిరాశే కనబడుతుంది. హాస్టళ్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారి పిల్లలు కాబట్టి వారికి ప్రతి ఒక్కరికి వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. సంక్షేమ హాస్టల్ లకు కనీస మౌలిక వసతులు లేక విద్యార్థుల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాబట్టి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి వసతి సౌకర్యం కల్పించి,పెరిగిన ధరలకు కనుగుణంగా 3000 మెస్ కాస్మోటింగ్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టలలు చాలావరకు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి వాటికి నూతన భవనాలు నిర్మించాలని,లేనియెడల సంక్షేమ మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శివకుమార్, నాయకులు రాజు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.