దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్ మహాసభలను జయప్రదం చేయండి
తాళ్లూరు, జూలై 18 : ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని ఎపిటిఎఫ్ కార్యాలయంలో దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్ మహాసభలు జరుగుతున్నాయని, దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్ నాయకులు కరుణానిధి తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యల గురించి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి తదుపరి దర్శి ఏరియాలో ఎఐఎస్‌ఎఫ్ అభివృద్ధిని గురించి చర్చించే అవకాశం ఉందని ఈ మహాసభలలో ఎఐఎస్‌ఎఫ్ అభిమానులు పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈ మహాసభలలో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐయ్యలయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు చంద్రానాయక్, జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు వసంత్ తదితరులు ఈ మహాసభల్లో పాల్గొని విద్యార్థుల సమస్యల గురించి చర్చిస్తారని ఈ మహాసభలలో ప్రజానాట్యమండలి కళాకారులచే విప్లవ గేయాలు ఆలపించడం జరుగుతుందని, ఈ మహాసభలను విద్యార్థులు, ఎఐఎస్‌ఎఫ్ అభిమానులు తప్పక పాల్గొని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.