దళితులకు పట్టాలు అందచేయాలి
మహబూబ్‌నగర్,పిబ్రవరి20(జనంసాక్షి): పేరుకే ప్రజావాణి జరుగుతోందని, సమస్యలపై అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దళితులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని వారి పేర్లపై పట్టా చేయించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్. రాంచందర్ కోరారు. ప్రభుత్వాలు భూములు ఉన్న భూస్వాములకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని, వీటిపై ఫిర్యాదు చేయగా.. 2014లో అప్పటి జిల్లా కలెక్టర్ భూస్వాముల నుంచి భూమి తీసుకుని నిరుపేదలైన దళితులకు ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలు అమలు పర్చి ప్రస్తుతం సాగుచేసుకుంటున్న దళితుల పేరున భూములు పట్టా చేయాలని ఆయన కోరారు. దేవాలయ భూములను కొందరు ఇష్టారాజ్యంగా క్రయ విక్రయాలు చేస్తూ మాన్యం భూములను కబ్జాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మండలాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలిపారు. సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.జిల్లాలోని 245 చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేప పిల్లలు విడిచే పక్రియలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని వీటిపై న్యాయ విచారణ చేపట్టాలని
తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. 3 ఇంచుల చేపపిల్లలు ఒక డ్రమ్ములో 6 నుంచి 8వేల వరకు మాత్రమే వస్తాయని, చెరువులో చేపలు వదిలే సమయంలో కొన్ని చోట్ల ఒక డ్రమ్ము పోసి ఒక లక్ష చేప పిల్లలు పోసినట్లు రికార్డులు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై విచారణచేస్తే అక్రమాలు వెలుగుచూస్తాయని అన్నారు.