దళితులను అవమానపరిచిన మంత్రి అల్లోల క్షమాపణ చెప్పాలి…భాజాపా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు
నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్28,జనంసాక్షి,,, తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందిని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు ఆరోపించారు. నర్సాపూర్ మండల కేంద్రంలో దళిత బందు గురించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు దళిత మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దళిత మోర్చా జిల్లా అధ్యక్షున్ని ముందస్తు అరెస్టు చేసి సోన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈసందర్భంగా రాచకొండ సాగర్ మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలు అరెస్టులకు భయపడరు, జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడతారని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాకు ఇష్టం వచ్చినవారికి ఇస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అని అనడం బిజెపి దళిత మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు సభలో దళితులకు అవమానపరిచే విధంగా మాట్లాడడం కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కొరకే దళిత బంధు ఇస్తున్నట్లుగా మాట్లాడడం సరి అయింది కాదాని నిజమైన లబ్ధిదారులను పారదర్శకంగాఎంపిక చేసి దళిత బందు అన్ని కుటుంబాలకు ఇవ్వాలని ,రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిఎడల దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లి అసెంబ్లీ నుంచి ఇంటికి పంపేంతవరకు నిద్ర పోమని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.అనంతరం బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు ఉంగరాల రాజు, కార్యదర్శి నరేందర్, జంగం గంగాధర్, పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు మెడిసిమ్మె రాజు ,సామా రాజేశ్వర్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు అలివేలు మంగ,BJYM జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనుముల శ్రావణ్, అసెంబ్లీ కన్వీనర్ కొండాజి శ్రావణ్, నాయకులు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, వినాయక రెడ్డి ,అంజి కుమార్ రెడ్డి, ఒడిశాల శ్రీనివాస్ ,బరకుంట నరేందర్, కౌన్సిలర్ కత్తి నరేందర్, నారాయణ మాజీ కౌన్సిలర్ భూపతిరెడ్డి ,దేవేందర్‌లు, మాజీ మండల అధ్యక్షుడు సీనియర్ నాయకులు, కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దావ.సాయన్న తదితరులు పాల్గొన్నారు
Attachments area
|