దళితులను బహిష్కరించడం సిగ్గు చేటు
కామారెడ్డి,సెప్టెంబర్17(జనంసాక్షి): గాంధారి మండలంలోని చిన్న పోతంగల్ గ్రామంలో దళితులు తమ ఆరాధ్య దైవంగా భావించే అంబెడ్కర్ విగ్రహాన్ని , ఛత్రపతి శివాజీ విగ్రహం పక్కన స్థాపించారనే నెపంతో దళితులను బూటకపు గ్రామాభివృద్ధి పేరిట బహిష్కరంచడం సిగ్గు చేటు అని ఉమ్మడి జిల్లాల పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు అల్గోట్ రవీందర్ అన్నారు..దళితులను గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా వారిపై దుర్భాషలాడుతూ , వారికి కేటాయించిన కమ్యూనిటీ హాలుకు గ్రామ ఉప సర్పంచ్ సహాయంతో తాళాలు వేయించి అనేక రకాలుగా దళితులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. బహిష్కరించిన వారిపై కేసులు పెట్టిన ఇంతవరకు నిందితులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు.. నిందితులను వెంటనే అరెస్టు చేసి వారిని కోర్టుకు హాజరు పరచడంతో పాటు దళితులకు కేటాయించిన కమ్యూనిటీ హాలును వారికే అప్పచెప్పాలని,దళితుల పట్ల వివక్ష చూపిన వారిపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రకాష్, గంగారాం, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.