దళితులపై లేని ప్రేమ పార్కులపై ఎందుకు
-మాయ మాటలతో దళితులను అవమణిస్తారా
-దళితవాడకు వందలెళ్లుగా రోడ్డులేదు
-పల్లె ప్రకృతి వనానికి వేసుకుంటారా
-బిజేవైఎం మండల అధ్యక్ష,కార్యదర్శులు నేలం నాగేంద్ర బాబు, ఎడ్ల రాజశేఖర్
మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి23 (జనంసాక్షి)
దళితులనే ముఖ్యమంత్రిని చేస్తా అన్న మాటను మరవడమే కాక దళితులను అడుగడునా టీఆర్ఎస్ నాయకులు అవమాణిస్తున్నారని బిజేవైఎం మండల అధ్యక్ష,కార్యదర్శులు నేలం నాగేంద్ర బాబు, ఎడ్ల రాజశేఖర్ లు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం జీవంచింపల్లి దళితవాడకు వందలెళ్లుగా రోడ్లు లేక బురదలో బ్రతుకుతున్నా పట్టించుకోని పాలకులు పల్లె ప్రకృతి వనానికి రోడ్లు వేసుకుని దళితులను అవనించారని మొక్కలపై ఉన్న ప్రేమ మనుషులపై చూపించడంలో విఫలమయ్యారని కేవలం వారి రాజకీయ లబ్ది కోసం కమీషన్ల కోసమే పార్కుకు రోడ్డు వేసుకున్నారని వారు ఆరోపించారు. దళిత వాడలు చేసుకున్న పాపమేంటో చెప్పాలని వారు డిమాండ్ చేసారు. దళిత వాడకు రోడ్లు వేస్తున్నామని నమ్మబలికి పార్కుకు అదికూడా నాణ్యత లేకుండా మట్టినే ఇసుకగా చూపించి తూతూ మంత్రంగా రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వెంటనే దళిత వాడలకు రోడ్లు, ఇరువైపులా సైడు డ్రైన్లను వేయాలని దళితులపై చిన్నచూపు చూడడం మానుకోవాలని హెచ్చరించారు. మట్టిని ఇసుకగా చూపించి నాణ్యత లేకుండా నాసిరకంగా వేసిన రోడ్డు ఎంతకాలం ఉంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులను చిన్నచూపు చూస్తే సహించేదే లేదని వారు హెచ్చరించారు. దళితులను అవమానించిన వారిపై నాణ్యత లోపంతో రోడ్డును వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కోరారు.