దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

g9tny5yfఅదిలాబాద్ : దళితుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బస్తీ పథకం అమలు తీరును అదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం కాప్రి గ్రామంలో ఆయన పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. దళితులకు భూ పంపిణీ కోసం సీఎం కేసీఆర్ 800 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు.