దళితుల తిండి, సంస్కృతి పై బీజేపీ దాడి.

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 2(జనం సాక్షి)
…..…………………………..

దళితుల తిండి ,సంస్కృతి పై బీజేపీ పాలనలో దాడులు నిత్యం పెరుగుతున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె వి పి ఎస్ ) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ జరిగింది ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన, ఆశయాలు గల కెవిపిఎస్ జెండాను నగర కార్యదర్శి గాజుల కనకరాజు ఆవిష్కరించారు. సామాజిక విప్లవ యోధులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేడ్కర్ల, చిత్రపటాలకు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ పూలదండ వేశారు ఈ సందర్భంగా తిప్పారపు సురేష్ మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2 న ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన, అనే లక్ష్యాల సాధన కోసం ఒక చారిత్రక అవసరంగా కెవిపిఎస్ ఏర్పడిందని అన్నారు. నేటికీ 24 ఏళ్లు నిండాయని తెలిపారు ఈ కాలంలోనే జస్టిస్ పున్నయ్య కమిషన్. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం. స్మశాన స్థలాల జీవో నెంబర్ 1235 ను పోరాడి సాధించిన ఘనత కె వి పి ఎస్ కు ఉందని తెలిపారు.దళితుల గృహాలకు 101 యూనిట్స్ కి ఉచిత విద్యుత్ జివోను 342ను కులాంతర వివాహాల జంటలకు 2లక్షల50 వేల రూపాయల ప్రోత్సాహక జీవో నెంబర్ 12 లను కెవిపిఎస్ పోరాడి సాధించిందని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం తన మనువాదాపు విధానాలతో దళితులు గిరిజనుల తిండి, సంస్కృతి,పై దాడి చేస్తుంటే సామాజిక సంఘాలను మేధావులను కలుపుకొని పోరాడిందని అన్నారు. రాజ్యాంగం లో ఆర్టికల్ 14 నుండి 19 వరకు పేర్కొన్న విదంగా చట్టం ముందు అందరూ సమానులే అన్ని రకాల వివక్షలను నిషేధించాలనె ఆశయాలు బీజేపీ పాలనలో హరిచబడుతున్నవాని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో సాంఘిక బహిష్కరణలు, దళితుల పై దాడులు హత్యాచారాలు పెరగడం తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారని అన్నారు దీంతో దళితులకు భారత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్య విధానం తో సామాజిక వర్గలకు విద్య దూరం అయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు.
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితులకు,గిరిజనులకు అసైన్డ్ చేసిన భూములను బలవంతంగా లాక్కుంటున్నారని అన్నారు. పొడు చేసుకుంటున్న దళితులు, గిరిజనుల పై దాడులు కేసులు పెడుతున్నారని అన్నారు. దళిత బందు లబ్ధిదారుల ఎంపికను ను ఎం ఎల్ ఏ లకు అప్పచెప్పి అర్హులైన పేదలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. దళితుల హక్కుల కోసం సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కెవిపిఎస్ ఈ పాలకులపై నిర్వీరమైన పోరాటం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం అశోక్. మహేందర్ రెడ్డి. నర్సయ్య.అరవింద్ . రమేష్. కృష్ణ. మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు