దళితుల భూపంపిణీలో అక్రమాలపై కన్నెర్ర చేసిన యువకులు

-మానకొండూర్‌ ఎమ్మెల్యే ఇంటిముందు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఇరువురు

-లంచాలివ్వనందుకే తమకు భూమి కేటాయించలేదని ఆవేదన

-హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌ తరలింపు

-స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):కరీంనగర్‌ జిల్లా ప్రజలంతా ఎంతో ఆనందంగా వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటుంటే మానకోండూర్‌లో ఘోరాతి ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కార్యాలయం ముందు ఇద్దరు బెజ్జంకి మండలంకు చెందిన దళిత యువకులు ఒంటిపై పెట్రెల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. క్షతగాత్రులు బారీ స్థాయిలో కాలిపోవడంతో వారిని హుటాహుటిన కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించి వెంటనే హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై దళిత సంఘాలు వారి బందువులుకుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరి ఆత్మహత్యకు ఎమ్మెల్యే రసమయి నిర్లక్ష్యమే ప్రదాన కారణమని బాదిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి,. ప్రభుత్వం చేపట్టిన భూపంపినీ కార్యక్రమంలో అర్హులను కాదని అనర్హులను ఎంపిక చేయడంతో ఎమ్మెల్యేను వారు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వారిపై దుర్బాషలాడడంతో ఈ అఘాయిత్యానికి ఓడిగట్టారని తెలుస్తోంది.

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో దళితులకు మూడు ఎకరాల భూమి పంపినీలో అవకతవకలు జరిగాయంటూ దళిత సంఘాలు గత కొద్ది రోజులుగా దర్నాలు చేస్తున్నాయి. అయితే ఈరోజు ఇద్దరు దళితులు పరుశరాములు, శ్రీనివాస్‌లు ఆందో ళనలకు దిగారు. అయితే దీనిపై ఎమ్మెల్యే స్పందించకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. అంతటితో ఆగకుండా పెట్రోల్‌ పోసుకుని

నిప్పంటించుకున్నారు. ఈఘటన చూసిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను కరీంనగర్‌ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడం

50శాతంకుపైగా విషమంగా ఉండడంతో హైదరాబాధ్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆసుపత్రికి చేరుకుని బాదితులను పరామర్శించారు. బాదితుల పరిస్థితి చూసిన మంత్రి వెంటనే హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బాదితులకు సరైన న్యాయం కల్పిస్తామని వారి కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి మెరుగైన వైద్య సేవలందిస్తామని ఈటెల రాజేందర్‌ విూడియాకు వెల్లడించారు. దళితుల ఆత్మహత్యకు సంబందించిన కారణాలను తెలుసుకుంటామని ఈఘటనకు బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెజ్జంకి మండలంలో దళితులకు మూడు ఎకరాల భూపంపినీ విషయంలో అవకతవకలు జరిగాయిన అర్హులైన దళితులకు ఇవ్వకుండా పైరవీలకు తావు ఇస్తూ ఉన్న వారికే భూములు పంపిణీ చేస్తున్నారని బాదిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై స్థానిక ఎమ్మెల్యే రసమయి దృష్టికి తీసుకెల్లిన ఏమాత్రం స్పందించకపోవడంలేదని దళితులు వాపోతున్నారు. మండలంలోని జడ్పీటిసి తన్నీరు శరత్‌రావు, వీఆర్‌ఓ శ్రీనివాస్‌ రెడ్డి వీరిద్దరు ఎమ్మెల్యే రసమయికి లంచాలు ఇస్తూ అర్హులైన దళితులను కాదని భూములున్న వారికే భూములు పంపిణీ అయ్యేలా పైరవీలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే మండలంలో 30 మందికి భూముల పంపిణీ చేసినట్లు నివేదికలున్నప్పటికి అందులో పదిమందికూడా దళితులు లేరని వారు ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూపంపిణీ పేరుతో నిరుపేదలైన దలితుల జీవితాలతో చలగాటమాడుతోందని, లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌ ఆరోపించారు. తమ ప్రభుత్వ హాయంలో కూడా 15 మందికి భూపంపిణీ చేశామని ఇప్పటివరకు ఆపంపిణీపై ఎలాంటి అబ్యంతరాలు రాలేదని, తెలంగాణా ప్రభుత్వం దళారులకు కొమ్ముకాస్తూ నిజమైన లబ్దిదారులకు మొండి చెయ్యి చూపడం వల్లనే ఈరోజు దళితులు తమ ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఈ సంఘటనలో పెట్రోల్‌ పోసుకున్న వారి ప్రాణంపోయినా కూడా తాము ఊరుకునేదిలేదని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలుచేస్తామని హెచ్చరించారు. ఈసంఘటనకు పూర్తి బాద్యత వహించి ఎమ్‌ఎల్యే రసమయి పూర్తి బాద్యత హించి తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు.

——————-