దళిత జర్నలిస్టుల ఫోరం ఉమ్మడి జిల్లా సమావేశం ను జయప్రదం చేయాలి.

దళిత జర్నలిస్టులందరికి దళిత బంధు అమలు చెయ్యాలి.
దళిత జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్30(జనంసాక్షి):
దళిత జర్నలిస్టుల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమావేశాన్ని అక్టోబర్ 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి దళిత జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తిని పవిత్రంగా భావించి,దమ్మిడి ఆదాయం లేకున్నా, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజా సమస్యలపై నిరంతరం ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల చైతన్య పరచడంలో తమ యొక్క బాధ్యత నిర్వహిస్తున్నారని,కావున తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న దళిత జర్న లిస్టులందరికి రెండవ విడత దళిత బంధులో మొదటి ప్రాధాన్యత కల్పించాలని దళిత జర్నలిస్టుల ఫోరం ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దళిత జర్నలిస్టులు ఎందరో ఉన్నారని,అలాంటి వారికి దళిత బంధు వర్తింపజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని,దళిత జర్నలిస్టుల సంక్షేమ కొరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నెలసరి గౌరవ వేతనం ఇచ్చి వారిని సమాజంలో వారి కంటూ ఒక గుర్తింపును తీసుకురావాల ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.