దళిత ద్రోహి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి..

దళిత దండోరా దీక్షలో మాజీ ఎమ్మెల్యే  మహేశ్ రెడ్డి
 నిర్మల్ బ్యూరో, అక్టోబర్ 07,జనంసాక్షి,,,  దళితులు, మహిళలను అవమాన పరిచిన మంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే ,ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటి చైర్మన్ యేలేటి మహేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు, శుక్రవారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన దళిత దండోరా ది క్ష లో ఆయన మాట్లాడుతూ దళిత మహిళ ను అవమాన పరిచిన మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాన్ సంత గ్రామం ఎల్లపెల్లి లోఅందరికి దళిత బంధు ఇచ్చినట్లే నియోజకవర్గంలో ని దళితుల అందరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ముందుగా మున్సిపల్ కార్యాలయం ముందు దీక్ష చెపాటుతమని చెప్పడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన ను ఇంటివద్దే నిర్బంధించారు. ఆయనను బయటకు వెళ్ళనియకుండా పోలీసులు పహారా కాశారు. ఉదయం ఆయన ఇంటి ముందు కార్యకర్తలకు పోలీసు లకు వాగ్వాదం జరిగింది. దింతో ఇంటి ఆవరణలో దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. దండోరా దీక్ష కు నియోజకవర్గంలో ని దళితులు, కార్యకర్తలు, నాయకులు ,పెద్దఎత్తున చేరుకున్నారు, వివిద ప్రజాసంఘాలు. దళిత సంఘాల నాయకులు సాంఘీభావం తెలిపారు.. సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమిపజేశారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డి.ముత్యంరెడ్డి, నాందేదపు చిన్నూ,జమాల్,అజర్.ఇమ్రాన్ ఉల్లాఖాన్, కౌన్సిలర్ చిన్నయ్య, పోశెట్టి, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు