దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు
* రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం 22వ డివిజన్ కు చెందిన ఎగ్గడి జగన్ దళితబంధు పథకంలో భాగంగా ఎంపికైన మహీంద్ర ఎక్స్ యూవి 300 కారును మంత్రి మీసేవ కార్యాలయంలో మంత్రి లబ్ధిదారుడు కు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని ప్రతి లబ్ది దారుడు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్ జంగిలి సాగర్ బోనాల శ్రీకాంత్ గందె మాధవి మహేష్ కోటగిరి భూమా గౌడ్ మాజీ ఎంపీపీ వాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.