దళిత బంధు ఎంపిక విధానంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలి

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పడిదల రవి*
: పెన్ పహాడ్. అక్టోబర్ 11 (జనం సాక్షి)
దళిత బంధు ఎంపిక విధానంలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా చూడాలని సూర్యాపేట ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పడిదల రవి డిమాండ్ చేశారు  ఎమ్మార్పీఎస్ మాదిగ దండోర ముందు దళిత బంధు ఎంపిక విధానంలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్  సూచనలకు అనుగుణంగా దళిత బంధు ఎంపిక విధానం చేయాలని మండల కేంద్రంలో ఎం ఆర్ ఓ వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులకు మేలు చేయాలనే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం దళిత బంధు ఎంపిక విధానంలో ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రమేయం లేకుండా ఎంపిక విధానం చేయాలని , ప్రభుత్వ అధికారుల చేత లబ్ధిదారుల  ఎంపిక చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాలని, దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ చేత నిర్వహించాలని దళిత బంధు ఎంపిక పథకం దళిత సంఘ నాయకులతో అధ్యయనం చేయాలని  డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లేటి లక్ష్మణ్ ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కనుకు జానయ్య ,ఎమ్మార్పీఎస్ జిల్లా కోశాధికారి బొజ్జ పరశురాం, పట్టణ అధ్యక్షులు ఏర్పుల సాయి, ఎమ్మార్పీఎస్ నాయకులు బన్నీ, దాసరి సాయికృష్ణ ,నాగరాజు నకిరేకంటి రాంబాబు, గోపి,మని ,వెంకటేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.