దళిత బంధు పై అధికార పార్టీ నేతలు బహిరంగ చర్చకు రావాలి..కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు

 నిర్మల్ బ్యూరో, అక్టోబర్09,జనంసాక్షి,,,    దళిత మహిళను మంత్రి నిండు సభలో అవమానిస్తే స్పందించని దళిత ద్రోహూలు, దళితుకందరికీ న్యాయం చేయాలని మహేశ్వర్ రెడ్డి దీక్ష చేస్తే విమర్శలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీఎస్ సి సెల్ నాయకులు చరణ్ మౌర్యఅన్నారు.ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ లోని దళిత నేతల తీరుతో నిర్మల్ నియోజక వర్గంలో ని యావత్ దళిత సమాజం సిగ్గుతో తలదించుకుంతున్నదని వాపోయారు,
మంత్రి సొంతూరు ఎల్లపల్లికో న్యాయం, మిగతా గ్రామాలకు ఇంకో న్యాయమా.. అక్కడ అందరికీ దళిత బంధు ఎలా ఇచ్చారు, మిగతా గ్రామాల్లో ఒకరిద్దరికే ఎందుకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.ఇదేమని ఓ దళిత మహిళ ధైర్యం చేసి మంత్రిని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తారా… అప్పుడు టీఆర్ఎస్ లోని దళిత నేతలు ఎందుకు మాట్లాడలేదన్నారు.దళితులను అరెస్ట్ చేస్తే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసే దళిత నాయకులు దేశంలో ఎక్కడా కనిపించరు, మంత్రి ఐకే దగ్గర తప్ప.నర్సాపూర్ లోని మహిళలే కాదు నిర్మల్ నియోజక వర్గంలోని ప్రతీ దళిత వాడల్లో అందరూ ప్రశ్నిస్తారు, అప్పుడు ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాంమని అన్నారు.ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ దళిత నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే దళిత వాడల్లో తిరిగి మా ఇష్టం వచ్చిన వాళ్ళకే దళిత బంధు ఇస్తామనే మాట చెప్పి చూడండీ, చెప్పులతో సమాధానం చెప్తారు.ఈవిలేకారుల సమావేశంలో    దళిత నాయకులు, ఎస్ సీ సెల్ ప్రెసిడెంట్ సంతోష్ ,యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకరి చందూ , నిర్మల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చరణ్ మౌర్య, మరికొంత మంది దళిత నాయకులు పాల్గొన్నారు.
Attachments area