దళిత బహుజనుల పట్ల మీ వైఖరేంటో చెప్పండి ?

2

– కులదోపిడీని ప్రోత్సహించింది కమ్యూనిస్టులే

– ‘అల్లం’ది త్యాగాల కుటుంబం

– మావోయిస్టు పార్టీ విమర్శ తగదు

– నారాయణకు బాసటగా నిలిచిన పెరక యూత్‌, బీసీ రైటర్స్‌, బహుజనపాట

హైదరాబాద్‌ ఆగస్టు 31 (జనంసాక్షి):  అల్లం నారయణ పద్ధతి మార్చుకోవాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో  మొదటగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బహుజనుల పట్ల కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీల వైఖరేంటో తెలియజేయాల్సిందిగా బీసీ రైటర్స్‌ వింగ్‌, బహుజనంపాట, పెరుక యూత్‌ ఫోర్స్‌ డిమాండ్‌ చేసింది. అది కూడా సెప్టెంబర్‌లో తలపెట్టిన సార్వాత్రిక సమ్మెకోసం మాట్లాడుతూ అల్లం నారయణ ను టార్గెట్‌ చేయడం సందర్భరహితమన్నారు . వర్గం పేరుతో కుల దోపిడీని ప్రోత్సహించిన కమ్యూనిస్టులు బహుజనుల పట్ల అందునా అత్యంత వెనుకబడిన సముహాల పట్ల తమ వైఖరిని మార్చుకోలేదనడానికి నిదర్శనం అన్నారు . అగ్రవర్ణ దోపిడీని భావజాలాన్ని ఏ మాత్రం ఖండించని ఈ విప్లవ పార్టీలు బహుజనుల పట్లతమ వైఖరి మారలేదనిడానికి, బహుజన మేధావుల పట్ల తమకున్న చిన్న చూపుకు నిదర్శనమన్నారు . జర్నలిస్టుల సమస్యలతో గత మూడేళ్లుగా ఇబ్బందిపడుతున్నమాట వాస్తవమే. అయితే రాష్ట్రంలో నడుస్తున్న  మోనోపాలిజం, ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ  అందరికీ తెలిసిందే అలా కాకుండా జర్నలిస్టుల మీద ఏమైనా కక్ష ట్టుకుని అల్లం నారయణ ప్రవర్తిస్తున్నారా..? ఆధారాలు ఉంటేచూపండని సవాల్‌ విసిరారు.  జర్నలిస్టుల కోసం రాజీపడకుండా పోరాడమని చెబితే సరిపోయేది. అలా కాకుండా ఎంగిలి మెతుకులకు ఆశపడిలాంటి భూర్భువా పదజాలం ప్రయోగించడం బహుజనులను అందునా అత్యంత వెనుకబడిన సముహాలను అవమానించడమే. అత్యంత వెనుకబడిన కులంలో పుట్టి విప్లవోద్యామాల కోసం కుటుంబం కుటుంబమంతా త్యాగం చేసిన చరిత్ర అల్లం సోదరులది. అసలు ఎర్రజెండా పాట పుట్టిందే అల్లం ఇంట్లో …ముఖ్యంగా అల్లంనారయణ విప్లవ జీవితంలో విప్లవోద్యమ భావజాలంలో 40 సంవత్సరాలు త్యాగమయమైన జీవితం గడిపిందన్నారు. జర్నలిస్టుగా తెలంగాణలో ఆయన కాంట్రిబ్యూషన్‌ అందరికీ తెలుసు. అయినారాష్ట్రంలో జిల్లాల విభజన అంశం, మల్లన్న సాగర్‌ అంశం. ఇసుక మాఫియా, రియల్‌ ఎస్టేట్‌, ల్యాండ్‌ గ్రాబింగ్‌.. అన్నింటికన్నా దేశాన్నే ఒక ఊపు ఊపుతున్న నయీం విషయం.. ఇంకా గోరక్షక్‌ పేరిట దళితులను ఊచకోత కోస్తున్న మనువాదులు…రాష్ట్రంలో దేశంలో ఉన్న నిరుద్యోగ స్థితి. ఆకలి చావులు … ఇవన్నీ చర్చించాల్సిన అంశాలు.. ఇవన్నీ వదిలేసి ఒక మంత్రి కాని..  ఒక కీలకమైన నిర్ణయాధికారంలేని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అయినటువంటి అల్లం నారాయణను పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్‌ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే అంశాల పట్ల ఆ పార్టీ స్పందిస్తే బాగుంటుందని అలా కాకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బహుజన నాయకుల మీద అలాగే బహుజన మేధావుల మీద అక్కరకురాని స్టేట్‌మెంట్‌లు ఇచ్చి ప్రజల్లో ఇంకా పలుచన కాకుండా జాగ్రత్త పడాలని బిసి రైటర్స్‌ వింగ్‌, బహుజనల పాట, పెరుక యూత్‌ ఫోర్స్‌ డిమాండ్‌ చేసింది. కాగా   ప్రకటనకర్తల  సంతకాలు ఈ ప్రకటనలోను మావోయిస్టునేత జగన్‌ పంపిన ప్రకటనలో  లేక పోవడం గమనార్హం.