దళిత బిడ్డపై ఇంత నిరాదరణా?: బోడిగశోభ
క
రీంనగర్,నవంబర్1(జనంసాక్షి): చొప్పదండి నుంచి వెనక్కి తగ్గేది లేదని, తప్పకుఏండా ఇక్కడినుంచే పోటీ చేస్తానని టిఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ అన్నారు. తనపై పితూరీలు చెప్పిన వారికి టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని కూడా అన్నారు. 18 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో పనిచేశానని, తనతో లబ్దిపొందినవారే దూషిస్తున్నారని టీఆర్‌ఎస్ నేత బొడిగె శోభ అన్నారు. గురువారం చొప్పదండి నియోజకవర్గంలో బొడిగె శోభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత బిడ్డనైన తనపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేసిన వారికి టికెట్ ఇస్తే ఊరుకునేదిలేదని, తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని బొడిగె శోభ స్పష్టం చేశారు.



