దళిత భూపంపిణీ పథకం లేనట్లే

భూములకు డిమాండ్‌తో అటకెక్కిన పథకం

నిజామాబాద్‌,జూలై9(జనం సాక్షి )): నిరుపేదలైన ఒక్కో దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని నిర్ణయించిన పథకం దాదాపుగా ఆగిపోయినట్లే కనిపిస్తోంది. సిఎం కెసిఆర్‌ ఇప్పటికే భూమి లేదన్న సంకేతాలు ఇచ్చారు. ఎవరైనా ప్రభుత్వానికి అమ్మడానికి ముందు వస్తే ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఇక ఈ పథకం అటకెక్కినట్లే కనిపిస్తోంది. దీనిపై అసెంబ్లీ వేదికగానే స్పష్టమైన ప్రకటన చేశారు. భూమి ఉంటే ఇద్దమానుకున్నామని ఇప్పుడు లేదని తేల్చేశారు. దీంతో భూమిపై ఆశలు పెట్టుకున్న ఎందరో రైతులకు నిరాశే మిగిలింది. వేళ్లవిూద లెక్కించే విధంగా లబ్దిదారులకు భూ పంపిణీ జరిగింది. మొత్తంగా దళితుల భూ పంపిణీ అన్నది ఇక లేనట్లుగానే భావించాల్సిందే. దీనిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలిన బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడం ముందు నేర్చుకోవాలన్నారు. కేంద్రాన్ని విమర్శించే ముందు హామలు నెరవేర్చాలన్నారు. దళితుల భూ పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో నిధులు కేటాయించకపోవడంతో కార్యక్రమం నీరుగారింది. భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ఓ కారణంగా చూడాలి. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు భూములు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గత ఏడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 600మందికి లోపే లబ్దిదారులకు మాత్రమే భూములను పంపిణీ చేశారు. గత ఏడాది నుంచి భూ పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో జిల్లా అధికారులు లక్ష్యాలను సైతం నిర్దేశించలేకపోయారు. ఇందులో అధిక మొత్తంలో ప్రయివేట్‌ వ్యక్తులన ఉంచి కొనుగోలు చేసిన భూమిని దళితులకు అందజేశారు. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు రూ.54. 78 కోట్ల విలువ చేసే భూములను కొనుగోలు చేసి నిరుపేద దళిత రైతులకు పంపిణీ చేశారు. దళితుల భూ పంపిణీపై రియల్‌ ఎస్టేట్‌ ప్రభావం తీవ్రంగానే చూపుతోంది. పేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల సాగు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన భూ పంపిణీకి ధరల పెరుగుదల గుదిబండగా మారింది. ప్రభుత్వ భూములు కూడా అందుబాటులో లేవు. ఎక్కడో ఓ చోట కొద్దిపాటి భూములు ఉన్న సాగుకు యోగ్యంగా లేవు. దీంతో ప్రయివేట్‌ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఇవ్వడం తప్ప మరో మార్గం లేని పరిస్థితులు ఎస్సీ కార్పొరేషన్‌కు ఎదురవుతుంది. జిల్లాలో జాతీయ రహదారులు ఉండటంతో మారు మూల ప్రాంతాలైన భూముల ధరలు విపరీతంగానే పెరిగాయి. దీనికి తోడు ఇటీవల గ్రావిూణ ప్రాంతాల్లోను పట్టణ కల్చర్‌ రావడంతో ఆ ప్రాంతాల్లోనూ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. జిల్లాలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎకరం 25 లక్షలకు పైగానే పలుకుతోంది. చివరకు మారుమూల గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపో యాయి. దీనికి ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ జోరుగా సాగుతుండడమేనని పలువురు రియల్‌ వ్యాపారులు వాపోతున్నారు.