దళిత వర్గాల అభ్యున్నతికి కృషి : ఎంపీ వివేక్
రామగుండం, జులై 22 (జనంసాక్షి) : దళిత వర్గాల అభ్యున్నతికి కృషి జరుపుతానని పెద్దపల్లి ఎంపీ డాక్టర్ జి.వివేకానంద అన్నారు. ఆదివారం మండలంలోని వేంనూరు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దళిత కుటుం బాల్లోని పిల్లలు విద్యాభ్యాసంలో, ఉద్యోగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం కృషి జరపడానికి ప్రయత్నిస్తామన్నారు. గ్రామంలో రోడ్డు, మంచినీటి సదుపాయాలు మెరుగు పరచాలని, ఎస్సీకాలనీ, కుక్కలగూడూరు గ్రామాలను ముంపుకు గురవుతున్న గ్రామాలుగా గుర్తించాలని ఎంపీని గ్రామ ప్రజలు కోరగా, ఈ సదుపాయాలను కలిపించడానికి, అధికారులతో మాట్లాడుతా మన్నారు. ఎస్సీకాలనీ, కుక్కలగూడూరు గ్రామాలను ముంపు గ్రామాల్లో చేర్చే విధంగా అధికారులతో మాట్లాడుతానిని ఆయన హామీ ఇచ్చారు. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీలో 18 సంవత్సరాలు నిండిన బాలికలకు వర్తించే విధంగా చర్యలు తీసుకుంటానని, గ్రామమహిళలకు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్ సలీంపాష, ఉరిమెట్ల రాజలింగు, బోడగుంట సుభాష్, శ్రీపతి శంకరయ్య, లక్ష్మణ్, తొగరి తిరుపతి, స్వామిగౌడ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.