దళిత సోదరులారా దళిత బంధు పథకంపై ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు
భీమదేవరపల్లి మండలం జూలై (24) జనంసాక్షి న్యూస్
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో అంబేద్కర్ చౌరస్తా వద్ద టి ఎంఆర్పిఎస్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు అంబాల చక్రపాణి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విడుదలవారీగా దళిత బందును ప్రతి ఒక్కరికి అందజేయడమే ప్రభుత్వ లక్ష్య అని అన్నారు
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏడు మండలాల గ్రామాల ప్రతి దళితుడికి దళిత బంధు పథకం వచ్చేల హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ కృషి చేస్తున్నారని . హుస్నాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కార్యకర్తలకె దళిత బంధు పథకం ఇస్తున్నారని ప్రతిపక్షాలు కెసిఆర్ ప్రభుత్వం పైకి దళితుల సోదరులను రెచ్చ గోడుతున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలకె దళిత బందు ఇస్తున్నరు అని దురు ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దు అని ,ఇటువంటి వార్తలో వాస్తవం లేదన్నారు.అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బందు వస్తుందని చెప్పారు. ప్రతి గ్రామంలోని ప్రతి దళిత కుటుంబాల వివరాలు సేకరించి దళిత బంధు కోసం పథకం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గం లోని వివిధ మండలాలలో,గ్రామాలలో దళిత బంధు పథకంపై కొంతమంది సృష్టిస్తున్న వదంతులు, అపోహల వల్ల దళితులు అధైర్యపడవద్దు అన్నారు. దళిత బంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబంలో సీఎం కేసీఆర్ కొత్త వెలుగు నింపబోతున్నారు. సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం, దళితుల అభ్యున్నతి కోసం , దళితులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా అని తీసుకువచ్చిన పథకం, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. దళిత బంధు పథకం అనేది ఒక నిరంతర పథకం ప్రతి దళిత కుటుంబానికి, ఉద్యోగికి, వచ్చే పథకం,దళిత బందు పథకంపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేయడం, విమర్శలు చేయడం సరైనది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి శాతి ముబారక్ రైతుబంధు రైతులకు 24 గంటల కరెంటు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టింది కానీ బిజెపి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు అంతేకాక 8 సంవత్సరాలు నుండి కేంద్ర ప్రభుత్వం దళితులు కి ఏం చేసిందో చెప్పాలి ప్రతి స్కీం కూడా దశలవారీగా ముందుకెళ్తుందని వారు మండిపడ్డారు రాష్ట్రంలో ప్రతి దళితుడికి దళిత బంధు స్కీమ్ అందజేయడమే జరుగుతుంది అన్నారు
