దారి

రాజమ్మకి కోపంగా వుంది. విసుగ్గా వుంది. విరక్తిగా ఉంది. చచ్చిపోవాలని వుంది. కానీ అంతలో ఐదేళ్ళ కూతురు జయసుధ కడుపులో పెరుగుతున్న బిడ్డా గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది. ఏమైనా చేద్దామంటే చెయ్యలేని పరిస్థితి. ఇల్లుగడువని స్థితి. ఆదుకోవడానికి ఎవరూలేరు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. భగవంతుడా అనుకొంది. ఎలాంటి ఆశాలేదు. చావే శరణ్యమని కాస్సేపు, బతుకుమీద తీపి మరి కాస్సేపు ఆలోచనలతో ఆమె తసమతమ వుతుంది. ఏం చెయ్యాలో తోచలేదు. ఆలోచనల్లో పడింది. ఆరోజు సంఘటన గుర్తుకొచ్చింది. ఆరోజు అర్థరాత్రి తన భర్త ఏదో దొంగ తనం చేశాడని అతన్ని జీపులో తీసుకపోయినారు. ఇల్లంతా శోధిం చినారు. కానీ ఎక్కడా ఏమీ దొరుకలేదు. ఆమెకి తెలిసి ఆమె భర్త ఏ దొంగతనం చెయ్యలేదు. నాంపెల్లి గుట్టకు పోయి బండకొట్టి అమ్మడం తప్ప అతను ఏమీ చెయ్యడం లేదు. గతంలో ఓ చిన్న దొంగతనం చేసింది నిజమే. ఆమె భర్త శివరాత్రి ఎల్లయ్య ఎంత బతిమిలాడినా అతన్ని వదిలిపెట్టలేదు. మూడు నెలల గర్భం ఐదేళ్ళ పిల్ల ఏం చెయ్యాలో తోచలేదు. తెల్లవారి పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. కాని ఎల్ల్య అక్కడ లేడు. అతన్ని తీసురాలేదని అక్కడి పోలీసులు చెప్పారు. ఇతర మండలాల్లో వున్న పోలీసుస్టేషన్‌కి వెళ్లింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఓ నెలరోజులు అతని కోసం చుట్టు పక్కల వున్న అన్ని పోలీసుస్టేషన్లూ తిరింది. కానీ ఎల్లయ్య ఎక్కడా కన్పించలేదు. అతని జాడ కోసం ఎవరూ ప్రయత్నించలేదు.  నెల రోజుల తరువాత ఓ రోజు సాయంత్రం నాలుగు గంటలకి పోలీసు జీపు వచ్చి రాజమ్మ ఇంటి ముందు ఆగింది. అప్పుడు రాజమ్మ చాటలో బియ్యం చెరుగుతూ వుంది. జీపు నుంచి ఎల్లయ్య ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్‌ దిగారు. ఎల్లయ్య నల్లగా బక్కగా అయినాడు. అతని రూపురేఖలు మారిపోయాయి. బలహీనంగా అడుగులు వేస్తూ ఇంటి వైపు వచ్చాడు. రాజమ్మకి దు:ఖం పొంగిపొరు ్లకొచ్చింది. అతని దగ్గరికి వడివడిగా అడుగులు వేస్తూ వచ్చింది. అతన్ని గుండెకు అదుముకొని ఏడువాలని వుంది. కానీ అతని ఇరుప్రక్కలా ఇద్దరు కానిస్టేబుల్స్‌ వుండడం వల్ల అలా చెయ్యలేకపోయింది.  రాజమ్మాక్ష్మ! అన్నాడు ఎల్లయ్య ఆమె దగ్గరకు వచ్చి, ఏం అనాలో తోచక ఏం అనాలో తోచక ఏట్లా వున్నావు ఏం ది చెప్పు అన్నట్లుగా చూసింది రాజమ్మ  రాజమ్మా మా ఎద్దులను, బండిని మూడు తులాల బంగారం కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌కి తీసుకొనిరా. నువ్వు తెచ్చిన తరువాతనే నన్ను కోర్టుకు పంపిస్తారట ఏడుస్తూ చెప్పాడు ఎల్లయ్య  రాజమ్మకి ఏం అనాతో తోచలేదు. ఏం సమాధానం చెప్పలేదు. ఆమె ఆలోచనలో వుండగానే వాడు చెప్పింది అర్థమైందా? వాడు చెప్పినట్టు చెయ్యి లేకపోతే వీడు అడ్ర సు లేకుండా పోతాడు బెదిరించాడు. మోలీల్‌సాబ్‌ జీపు దగ్గర నిల్చు ని ఎల్లయ్య దగ్గరికి రోయింది. రాజమ్మ ఇంతలోనే మోలీల్‌సాబ్‌ గట్టిగా ఎల్లిగాడిని తీసుకొని రండి అన్నాడు. ఆ ఆదేశాన్ని వెంటనే అమలు చేశౄరు. కానిస్టేబుల్స్‌. ఎల్లయ్యను తీసుకొని వెనక్కి తిరిగారు. రాజమ్మకి లేచొఇ్చన ప్రాణం పపోయినట్టు అన్పించింది. ఏదో చెప్పాలనుకుంది. చెప్పలేకపోయింది. నెల రోజుల తరువాత కన్పించిన భర్తని పూర్తిగా చూడకుండానే అతనితో మాట్లాడకుం డానే అతన్ని జీపు దగ్గరికి తీసుకుపోతుంటే అన్ని కోల్పోయినట్టుగా అన్పించింది. తండ్రిని చూసి దగ్గరికి రాబోయిన బిడ్డ బిక్కచచ్చిపో యింది. రాజమ్మకి దు:ఖం కట్టలు తెంచుకుంది. ఎడ్వటం మొదలు పెట్టింది. ఆమె ఏడపు జీపు శబ్ధంలో కలిసిపోయింది. తండ్రిని జీపులో తీసుకపోవడం చూసి తల్లి నేల మీద కూలబడి ఏడ్వటం చూసి ఐదేళ్ల కూతురు కూడా ఏడ్వటం మొదలు పెట్టింది. ఏడ్చీ ఏడ్చీ అట్లాగే అక్కడే కూర్చుండిపోయింది. బిడ్డకూడా ఏడ్చి ఏడ్చి అలసి సొమ్మసిల్లి నిద్రలోకి జారుకుంది. కాస్సేపట్టి తరువాత రాజమ్మ తేరుకుంది. బిడ్డని ఎత్తుకొని లోపల చాపమీద పడుకోబెట్టింది. కుండలో నుంచి ఓ గ్లాసెడు మంచినీళ్ళు ముంచు కొని తాగింది. ఆ తరువాత బిడ్డ పక్కనే చాపలో పడుకుంది. పడుకుందన్న మాటే గాని మనస్సంతా ఆలోచనలు. మూడేళ్ళ క్రితం ఒక్కసారి ఇంకో ఇద్దరు మిత్రులతో కలిసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్లని ఆపి బెదిరించి డబ్బులు తీసుకున్నారు. ఆ తరువాత పోలీసులు ఎల్లయ్యని కూడా దొరుకబట్టి కేసు పెట్టిండ్రు. సిరిసిల్ల కోర్టు ఆరునెలల జైలు శిక్ష కూడా వేసింది. ఆ తరువాత మళ్లి ఎప్పుడు అట్లాంటి హాని చెయ్యలేదు. ఎల్లయ్య, బండ కొట్టి కట్రౌతు వేములవాడ పూళ్ళో అమ్మడం, కంకర కొట్టడం అమ్మడం  తప్ప వేరే జీవితం లేదు. ఎల్లయ్యకి మరెందుకు ఎల్లయ్యని పోలీసులు తీసుకొని పోయినారు. నెలరోజులు ఎక్కడ వుంచినారు? ఎన్ని దెబ్బలు కొట్టిండ్రో ఈ నెలరోజులు ఎల్లయ్య కోసం తను పడిన యాతనాలు అన్ని గుర్తుకొచ్చినాయి. ఈ ఎడ్లు పోతే మళ్లి కొనుక్కొవచ్చు. ఈ బండిపోతే మళ్లి కొనుక్కొవచ్చు కాని ఎల్లయ్య బోతే …? గిటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనుకుంది. రాజమ్మ పొద్దుగాలనే తమ కులపోళ్ళ ఎవరైనా కొనుకుంటారేమో అడగాలి. వాళ్ళ దగ్గర గిన్నిపైసలు ఎక్కడుం టాయి? తనకు తానే జవాబు చెప్పుకుంది. సర్పంచ్‌కి అ మ్ముతే రెండు పైసలు తక్కువ చ్చిన తొందరగా చేతికి పైసలు వస్తాయి. తన ఆలోచనికి సమాధానాలు దొరికిన తరువాత రాజమ్మ మనస్సు స్థిమితమైంది. పొద్దున్నే లేచింది. రాజమ్మ. రాత్రి మిగిలిన అన్నం కూతురికి ఇంతపెట్టి తనూ ఇంత తిన్నది. బండి కట్టుకొని సర్పంచ్‌ ఇంటికి పోయింది. బండిని ఆపి ఎడ్లను చెట్టుకు కట్టేసి సర్పంచ్‌ దగ్గరికి పోయింది. సర్పంచ్‌ కచేరీలనే కూర్చున్నాడు. సర్పంచ్‌కి కన్పించి భయం భయంగా పక్కకు నిల్చుంది. అదెందుకు వచ్చిందో అడుగురా? అన్నాడు సర్పంచ్‌ అక్కడే వున్న సుంకరితో చెప్పవే ఎందుకొచ్చినవో అన్నాడు. రాజ మ్మకేసి చూసూఏ్త విషయమంతా చెప్పించి రాజమ్మ. సుంకరోడు చెబుతున్నడే నిన్న సాయంకాలం పోలీసులు మీ ఇంటికి వచ్చిండ్రని అయినా బండకొట్టుకొని బతి కుండా వాడికి మళ్లీ గిదేం బుద్ధి పుట్టిందే అన్నాడు సర్పంచ్‌ ఎల్ల య్య ఏమీ చెయ్యలేదని అన్యాయ ంగా పోలీసులు పట్టుకొని పోయా రని దూరం నుంచే కాళ్ళు మొక్కి సహాయం చెయ్యమని కోరింది రాజమ్మ. సాయంత్రం వచ్చి పైసలు తీసుకపో అన్నాడు సర్పంచ్‌ దీన్ని సెక్రటీ దగ్గరకు తీసుకుపోయి ఈ బండి ఎడ్లు అమ్మినట్టు కాగితం రాయించు చెప్పిండు సుంకరితో రాజమ్మని తీసుకొని సుంకరి పంచాయితీ ఆఫీసుకి తీసుకపోయాడు. కాగితం రాసి రాజమ్మ వేలిముద్ర తీసుకున్నాడు. రాజమ్మ సాయంత్రం సర్పంచ్‌ ఇంటికి వచ్చింది. పంచాయితీ సెక్రటరీ వున్నాడు. రాజమ్మకి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిండు కాగితం మీద సంతకం తీసుకున్నాడు. చీకటైపోయిందని ఆ రాత్రికి కరీంనగర్‌కి బయల్ధేర లేదు రాజమ్మ. పొద్దుగాలే లేచి బిడ్డను సంకనేసుకుని నాంపెల్లి బస్టాపు దగ్గరికి వచ్చింది. రాజమ్మకి ఓపిక లేదు. నాలుగో నెల దాటింది. అయినా తప్పుదు. లేకపోతే ఎల్లయ్య ఏమైపోతాడో? అట్లా అనుకోగానే ఎక్కడలేని ఓపిక వచ్చింది. రాజమ్మకి వచ్చేటప్పుడు ఇంట్లో ఎక్కడో భద్రంగా దాచిన గొలుసు కూడా వెంట తెచ్చుకుంది. బస్సెక్కి కరీంనగర్‌లో దిగింది. క్లాక్‌ టవర్‌ దగ్గరకొచ్చి సర్పంచ్‌ ఇచ్చిన డబ్బులతో రెండు తులాలు బంగారం కొన్నది. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ వివరాలు తెల్సుకుంటూ అక్కడికి బయల్ధేరింది. స్టేషన్‌ దగ్గరికి వచ్చింది. భయం భయంగా వుంది. అక్కడి వాతావరణం చూసి బిడ్డ తల్లి గుండెకు హత్తుకొంది. సెంట్రీ దగ్గరకు పోసి తాను వచ్చిన విషయం చెప్పింది. లోపలికి పోవడానికి అనుమతిని ఇచ్చాడు. వెనుకవైపు వున్న రూంలో మోరీల్‌ సాబ్‌ వున్నాడని మోరీల్‌సాబ్‌ సిగరేట్‌ తాగుతూ కన్పించాడు. రాజమ్మని చూసి గుర్తుట్టిండు. తెచ్చినావె బంగారం అన్నాడు. తెచ్చిన అంటూ బంగారం గొలుసూ టేబిల్‌ మీద పెట్టింది. ఈ గొలుసుక్కెడిదే మొన్న ఇంట్లో వెతికినప్పుడు కన్పించలేదే అన్నాడు చాలా పెద్దగా నోరు తెరిచి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు రాజమ్మకి. ఎంత బంగారమే అది అన్నాడు. రెండు తులాలు సారూ. ఎడ్లు బండి అమ్మిన పైసల్తో రెండు తులాలే వచ్చినవి. అందుకే ఈ గొలుసు తెచ్చిన అన్నది రాజమ్మ. ఇదెంత వుంటదే అన్నాడు. అర్ధతులం పైనే వుంటదీ సారూ. మరింక అద్దతులం ఎప్పుడూ తెస్తవే అన్నడు. ఇంక నా దగ్గర ఏమీ లెవ్వు సారు. నీ దండం బెడతా ఇంక ఎల్లదిసారు. అంటూ నేలని మొక్కింది. సరే పో అమీన్‌సాబ్‌ ఏమంటాడబో చూడాలే ఇంక ఏం చెయ్యలేను సారూ మీ కాళ్ళు మొక్కతా మీరే ఎట్లనైనా అమీన్‌సాబ్‌ని ఒప్పిచుండ్రి … సరే చెప్పుతపో ఓ రెండు రోజుల్లో కోర్టుకు తీసుపోతాం అన్నాడు మోరీల్‌సాబ్‌. ఒక్కసారి కలిసి మాట్లాడుతసారూ అంది రాజమ్మ గొంతు పెగల్థీసుకుని వాడిక్కడలే డు. ఎల్లుండి కోర్టుకి తీసకొస్తం అక్కడికి రాపో అన్నాడు. నిరుత్సా హంగా వెనక్కి అడుగు వేసింది రాజమ్మ. రెండు రోజుల తరువాత ఎల్లయ్యని కోర్టుకు తీసుకొని వచ్చారు. దారి వెంట వెళ్తున్న స్త్రీ మెడలో నుంచి గొలుసు దొంగతనం చేస్తుంటే అక్కడే కానిస్టేబుల్‌ పరుగెత్తి పట్టుకున్నాడని ఆ గొలుసుని పోలీసులు ఇద్దరు సాక్షుల సమక్షంలో స్వాధీనపరుచుకున్నారని నేరారోపణ పత్రంలో పోలీసులు పేర్కొన్నారు. రాజమ్మ బిడ్డని తీసుకొని కరీంనగర్‌ కోర్టుకి వచ్చింది. ఎల్లయ్యని చూసింది. పోలీసులని త్రిమిలాడి ఎల్లయ్యతో రెండు నిమిషాలు మాట్లాడింది. తాను నేరం చెయ్యలేదని అయినా  నేరం ఒప్పుకుంటున్నానని ఎల్లయ్య రాజమ్మమకి చెప్పాడు. దొంగతనం చెయ్యనప్పుడు ఎందుకు ఒప్పుకోవడం అంది రాజమ్మ. నీకు తెలియదేరాజమ్మ. మనకు బెయిల్‌ రాదు. వచ్చినా జామీన్‌ దార్లు లేరు పోలీసులు చెప్పినట్లు మూడునెలలు శిక్ష అనుభవించి వస్తే మంచింది. ఒప్పుకోకపోతే ఇంకా రెండు కేసుల్లో ఇరికిస్తానని ఆ మోరీల్‌సాబ్‌ అన్నాడు. అందుకని ఒప్పుకుంటున్నా అన్నాడు ఎల్లయ్య. మూడు నెలలే శిక్ష వేస్తారంటావా ఇలాంటి కేసుల్లో మూడు నెలలే వేస్తున్నారని మోరీల్‌సాబ్‌ చెప్పిండ్రు నాక్కూడ మూడు నెలలే శిక్ష పడుతుందని చెప్పిండూ అయిన మనకు వేరే తొవ్వలేదు. ఈ మూడు నెలలు ఎట్లాగో కాలం గడుపుఅన్నాడు. ఎల్లయ్య అట్లా అంటున్నప్పుడు ఎల్లయ్య గొంతుచిన్నపోయింది. రాజమ్మకి ఏమి ట్లాడాలో తోచలేదు. కోర్టు అటెండర్‌ ఎల్లయ్య కేసుని పిలిచారు. పోలీసులు ఎల్లయ్యని కోర్టులోకి తీసుకొని పోయినారు. ఎల్లయ్యని రిమాండ్‌కు పంపించి నాలుగు రోజుల తరువాత కేసుని పెట్టారు. ఆ తరువాత మళ్లీ కోర్టుకి తీసుకవ చ్చారు. ఎల్లయ్యని ఎల్లయ్య నేరం ఒప్పుకున్నాడు. కోర్టు అతనికి ఒక సంవత్సరంపాటు శిక్షను విధించింది. అట్లా ఎందుకు అయ్యిం దో ఎల్లయ్యకి అర్దం కాలేదు. ఆ రోజు కూడా కోర్టుకి వచ్చిన రాజమ్మకి అంతా అగమ్యగోచరంగా అన్పించింది. పోలీసులు ఎల్లయ్యని జైలుకి తీసుకొని వెళ్లారు. రాజమ్మ ఏడుస్తూ నాంపెల్లికి వెళ్లిపోయింది. రెండు నెలలు గడిచాయి. భారంగా రాజమ్మకి చాలా కష్టంగా గడుస్తున్నాయి. రోజులు. అయిదు నెలలగర్భవతి పనికి వెళ్లలేదు. పనికి వెళ్ళకపోతే గడువని పరిస్థితి. వున్న ఒక్క తమ్ముడు బతుక్కోసం బొంబాయి పోయిండు. ఎల్లయ్య వైపు నుంచి ఎవరూ లేరు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుం ది. రోజు రోజుకూ ఆమె పరిస్థితి దుర్భరమవుతుంది. కాళ్లకి నీరు వస్తుంది. బిడ్డ చెప్పినట్టు వినడం లేదు. భర్త భయటకు వచ్చే అవకాశం లేదు. ఇంక బతకడం కన్నా చావడం మేలు. ఇట్లా ఎన్నో సార్లు అనుకున్నది. బిడ్డకి ఇంత విషం పెట్టి తాను చనిపోవా లనుకున్నది. కాని భర్తకి ఈ సంగతి తెలుస్తుందా? తెలియకపోతే జైలు నుంచి వచ్చిన తరువాత తెలసుకొని అతను ఏమైపోతాడు ? జైల్లో వున్నప్పుడే తెలిస్తే అతని పరిస్థితి ఏమిటీ? మరి ఎలా బతకాలి? ఇవీ ఆమెకు సమాధానాలు దొరుకని ప్రశ్నలు ఎప్పుడూ ఇవే ప్రశ్నలు. ఈ ప్రశ్నలో ఆమెకు పిచ్చెక్కిపోతుంది. భర్తకి చెప్పి చచ్చిపోతే ఇది నచ్చింది. అందుకని జైలుకి వెళ్లి భర్తను కలువాలని నిశ్చయించుకొంది. తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆమె అనుకుంది. మనస్సుని స్థిమిత పరుచుకుంది. తెల్లవారి డబ్బులు సమకూర్చుకొని హైదరాబాద్‌ బయల్ధేరింది. చంచల్‌గూడా జైలుకి వచ్చింది. ఎదురుగా చెట్టుకింద నిల్చున్న జైలు సిబ్బందిని బ్రతిమిలాడి ములాఖత్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఓ గంట తరువాత ఎల్లయ్యని ములాఖత్‌ గదిలోకి తీసుకొచ్చారు. రాజమ్మ, బిడ్డను తీసుకొని అక్కడకు వచ్చింది. బరువుగా వున్న భార్యను, చేతిలో వున్న కూతురిని చూడగానే ఎల్లయ్యకి దు:ఖం వచ్చింది. తనని అన్యాయంగా కేసులో ఇరికించిన పోలీసులపై ఎక్కడలేని కోపం వచ్చింది. ఆశక్తితకి ఆయన మీద ఆయనకే కోపం వచ్చింది. ఎదురుగా ఇనుక తెర తెరకి అటు నిస్సహాయంగా భార్య కూతురు. ఇటు ఆశక్తతతో తను ఎప్పుడో చేసిన దొంగతనానికి శిక్షని ఇప్పుడు అనుభవిస్తున్నాను. అదీ అన్యాయంగా ఎట్లా వున్నావూ? ప్రశ్నించాడు ఎల్లయ్య. ఎం చెప్పాలి. శాతనైత లేదు. దీనికి సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నా, పని చెయ్యలేకపోతున్నా, వాళ్ళని వీళ్ళని వెళ్ళి అడుకుంటూ కాలం గడుపుతున్నా నెలలు దగ్గ పడుతున్న కొద్ది భయమవుతుంది. ఆగింది రాజమ్మ మన చుట్టు ప్రక్కలున్నోళ్ళు ఎవరు చూడడం లేదా?

వాళ్ళు చూసెపట్కె ఇన్ని రోజులు గడిచినయి లేకపోతే ఎన్నడో చచ్చిపోయ్యేవాళ్లము. నువ్వు ధైర్యంగా వుంటానంటే ఓ మాట చెబుదామని వచ్చిన చెప్పు ఇల్లు అమ్ముతానంటావా? అదికాదు, అది ఎవరు కొంటారు. సర్కార్‌ కదా. ఈ మూడు నెలలు గడువటం కష్టం, గడిచినా మిమ్మల్ని చూడటానికి ఎవరూ లేరు. అందుకని … అందుకని దీనికంత విషం పెట్టి నేను తాగాలనుకుంటున్నాను బాధతో భయంతో చెప్పింది. ఎల్లయ్యకి కోసం వచ్చింది. బాధవేసింది. తన మీద తనకు అసహ్యం వేసింది. ఓ రెండు నిమిషాలు ఆలోచించాడు. రాజమ్మా.. అన్నాడు. ఎప్పు అన్నట్టుగా చూసింది. ఇక్కడి దగ్గరకురా… ఇనుక తెర దగ్గరకు వెళ్ళింది. నువ్వు చచ్చుడు దాన్ని చంపుడూ కాదు, ఇక్కడికి వచ్చిన అనుబ óవంతో ఓ మాట చెప్త వింటవా… చెప్పు దీనికి ఎదురుగా ఆడవాళ్ళ జైలున్నది అక్కడంతా ఆడవాళ్ళే వుంటారు. దవాఖానా వుంది. డాక్టర్లు వున్నారు. అయితే నేను చెప్పేది విను. ఓ సిటీ బస్సేక్కు ఎవరైనా ఆడవాళ్ళ మెడలోని గొలుసుని తెంపి పరుగెత్తే ప్రయత్నం చెయ్యి… అంటే నన్ను దొంగతనం చెయ్యమంటావా? నువ్వు అనుభవిస్తున్నది చాలదా? కోపంగా అన్నది. నేను చెప్పేది విను. తొందరపడకు నువ్వు వాళ్ళకి దొరికిపోతావు. నువ్వు గర్భంతోని వున్నావు. అందుకని పోలీసులు తొందరగానే కోర్టుకి పంపిస్తారు. నాలాగా నువ్వు నేరాన్ని ఒప్పుకోవద్దు నీ కేసు తొందరగా ఒడవదు. ఆడవాళ్ళ జైల్లో వుండొచ్చు. అక్కడే బిడ్డను కనొచ్చు చెప్పాడు. అతను చెప్పిన మాటలతో రాజమ్మ ఆలోచనల్లో పడింది. అతని మాటని పూర్తిగా తీసివేసేటట్టుగా అన్పించలేదు. రాజమ్మ కొంత మెత్తపడ్డట్టు ఎల్లయ్యకి కూడా అన్పించింది. రాజమ్మా ఇప్పుడు మనమున్న స్థితిలో వేరేది ఏదీ కన్పిస్తలేదు. అన్నాడు. మరి దీని సంగతీ అంది బిడ్డను చూపిస్తూ దాన్ని కూడా నీతోపాటే వుంచుతారు. అన్నానికి బాధ వుండదు. డాక్టర్లుంటారు. ఇప్పుడు మనమున్న పరిస్థితిలో ఇంతకు మించి మరేమీ చెయ్యలేం. ఒప్పుకున్నట్టే గదా! సరే వేరే తొవ్వ కన్పించడం లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తా! అంది రాజమ్మ తాము చేసేది తప్పైనా అంతకుమించి మరోదారి కన్పించలేదు. ఇద్దరికి. ఒక నేరంలో ఒక మనిషిని అన్యాయంగా ఇరికిస్తే దాని ఫలితం మరో నేరమా?