దారితప్పి గ్రామంలోకి వచ్చిన నెమలిని అడవిలో వదిలేసిన అధికారులు

కరీంనగర్‌: రామగండం మండలం జయ్యారం గ్రామంలోకి దారితప్పి వచ్చిన నెమలిని గ్రామస్థులు ఆడవిలో వదిలేశారు. శుక్రవారం రాత్రి గ్రామంలోకి వచ్చిన నెమలిని స్థానికులు పట్టుకుని గ్రామంలోని ఒక ఇంట్లో ఉంచారు. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించిన అనంతరం ఉదయం నెమలిని అడవిలో వదిలేశారు. గ్రామంలోకి నెమలి రావటంతో దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామాస్థులు తరలివచ్చారు.