దారిద్య్ర భారతం

2

– సంపన్న దేశాల జబితాలో ఏడోస్థానం

న్యూదిల్లీ,ఆగస్టు 23(జనంసాక్షి): భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి మాత్రమే ఉన్న ఏకైక లక్షణం. అది సంస్కృతి పరంగానే కాదు, ఆర్థిక, అభివృద్ధి అంశాల్లోనూ కన్పిస్తుంది. ఈ దేశంలో రూ.10కీ భోజనం దొరుకుతుంది. రూ.1000కీ భోజనం దొరుకుతుంది. అయితే ఒక్క జాఢ్యం మాత్రం దేశాన్ని వేధిస్తోంది. ఉన్నవాళ్లు మరింత ఉన్నవాళ్లు అవుతుంటే.. పేదలు నిరుపేదలుగా మారుతున్నారు. సంపన్న దేశాల టాప్‌-10 జాబితాలో భారత్‌ ఏడో స్థానంలో నిలిచింది. భారత్‌ మొత్తం 5,600 బిలియన్‌ డాలర్ల సంపదను కలిగి ఉందని ‘న్యూ వరల్డ్‌ వెల్త్‌’ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌ పేద దేశం కాదని చెప్పడానికి ఈ నివేదిక ఒక నిదర్శనం.దేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన సగటు నికర ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. ఇందులో ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. గత ఐదేళ్లలో చైనా వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అదేవిధంగా భారత్‌, ఆస్ట్రేలియా కూడా త్వరితగతిన అభివృద్ధిని సాధిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. కేవలం 12 నెలల వ్యవధిలోనే ఇటలీని వెనక్కి నెట్టి కెనడా ముందు వరసలో నిలబడింది.