దున్నేసిన స్పిన్నర్‌లు…

ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయంకొలంబో:
స్పిన్నర్‌లు దున్నేశారు..ఫాస్ట్‌ బౌలర్లు రఫ్ఫాడించారు…బ్యాట్స్‌మెన్‌ బాదేశారు..టోటల్‌గా లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌పై నామ మాత్రంగా జరిగిన పోరులో ధోనిసేన భారీ విజయం సాధించింది..ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌..ఇంగ్లాండ్‌పై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది..మొదటి మ్యాచ్‌లో పసికూనలపై కూడా తడబడిన బ్లూమెన్‌..రెండో మ్యాచ్‌లో మాత్రం ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లాండ్‌ను గడగడలాడించింది..చాలా రోజులుగా ఫామ్‌లో లేని హర్బజన్‌ విజృంబించి 4 వికెట్లతో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పనిపట్టడంతో కేవలం 80 పరుగులకే కుప్పకూలాంది..తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది..అయితే భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది..సెహ్వాగ్‌ గైర్హాజరీతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన పఠాన్‌ను 8 పరుగులకే స్టీవెన్‌ ఫిన్‌ ఔట్‌ చేశాడు..అనంతరం బరిలోకి దిగిన విరాట్‌..గంభీర్‌తో కలిసి విజృంబించి ఆడాడు..హాఫ్‌ సెంచరీ దిశగా సాగుతున్న విరాట్‌ కోహ్లీని గ్రేమ్‌ స్వాన్‌, గంభీర్‌ను ఫిన్‌ ఔట్‌ చేయడంతో తడబడ్డ భారత్‌ ఇన్నింగ్స్‌కు చాన్నాళ్లుగా ఫామ్‌లో లేని రోహిత్‌ ప్రాణం పోసాడు..కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు..చివర్లో ధోనిని డెర్మ్‌బాచ్‌ తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ బాట పట్టించడంతో భారత్‌ స్కోర్‌ 170 పరుగుల వద్ద ఆగింది..అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత్‌ బౌలర్లు ఏమాత్రం కోలుకోనివ్వలేదు..తన తొలి ఓవర్లోనే పఠాన్‌, హాలెస్‌ వికెట్‌తో ఇంగ్లాండ్‌ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు..రెండు పరుగులకే ఒక్క వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌ ఏదశలోనూ కోలుకోలేదు..పఠాన్‌ తన తర్వాతి ఓవర్లోనే లూక్‌ రైట్‌ను వెనక్కి పంపించాడు..ఇక స్కోర్‌ 39 పరుగుల వద్ద ఇయాన్‌ మోర్గాన్‌ వికెట్‌ను పడగొట్టడంతో మొదలైన భజ్జి వికెట్ల పతనం చివరి వరకూ కొనసాగింది..మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో భజ్జి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు..పీయూష్‌ చావ్లా సైతం రెండు వికెట్లతో దున్నేయడంతో ఇంగ్లాండ్‌ 80 పరుగులకే కుప్పకూలింది..ఇక 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్‌లతో 35 పరుగులు సాధించిన ఓపెనర్‌ కీస్వెటర్‌ ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌లలో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు..ఇక మిగిలిన వారిలో బట్లర్‌ 11, డెర్మ్‌బ్యాచ్‌ 12 పరుగులు సాధించారు..మిగిలిన బ్యాట్స్‌మెన్‌లలో ఒక్కరూ కూడా రెండంకెల స్కోర్‌ సాధించలేకపోయారు. ఇంగ్లాండ్‌ స్పిన్‌ ఎదుర్కోవడంలో తన అశక్తతతను మరోసారి భయటపెట్టుకొంది..ఇక చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చి 4 వికెట్లు సాధించి టీ 20లో తన బెస్ట్‌ను సాధించిన భజ్జికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.