దుబాయిలో బతుకమ్మ సంబరాలు

శ్రీమార్మోగిన జై తెలంగాణ శ్రీ హోరెత్తిన తెలంగాణ ఆటా,పాట
దుబాయ్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి):

దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి..తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలను దుబాయిలోని ప్రవాసతెలంగాణీయులు ఘనంగా జరుపుకున్నరు.

శుక్రవారం అరేబియా సముద్ర తీరాన ఉన్న అల్‌ మామ్జార్‌ ఉద్యా నవనం ప్రకృతి రమణీయతల నడుమ 1500 మంది ప్రవాసీయుల ఒక మహత్తర మానవ సమ్మేళనంతో ఎమరేట్స్‌ తెలంగాణ సాంస్కృ తిక సంఘం (ఈసీటీఏ) ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9.30 ని వరకు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంది అవార్డు గ్రహీత న్యూస్‌ ప్రజెంటర్‌ రాణి రుద్రమ హాజరుకాగా సుమారు 500 మంది కుటుంబాలు, 400 మంది బ్యాచులర్స్‌ మొత్తం 1500 ప్రవాసీయులు హాజరయ్యారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌లోని 7 రాష్ట్రాలలో నివసిస్తున్న ప్రజలతోపాటు ఒమన్‌ దేశం నుంచి కూడా కొంతమంది కుటుంబాలు వచ్చి పాల్గొనడం విశేషం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆడప డుచులు ”బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ” అంటూ పాడిన పలు పాటలు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి శ్రవణానందం కలిగింపచేశాయి. పలు రకాలైన రంగురంగుల పువ్వులతో పేర్చిన సుమారు 200 బతుకమ్మలను ఆడపడుచులు తలపై ఎత్తుకొని పార్క్‌లోకి వచ్చిన తీరును చూసి ప్రతి ఒక్కరు మంత్రమగ్దులయ్యారు. పార్క్‌లో మహిళలు తీసుక వచ్చిన బతుకమ్మలను ఒక చోట పెట్టి కార్యక్రమానికి హాజరయిన ముఖ్య అతిథి, మహిళలు, మరియు ఈటీసీఏ సభ్యులు భక్తిశ్రద్ధలతో గౌరీ పూజను ఘనంగా నిర్వహించారు. సుమారు 3 గంటలపాటు నిరంతరంగా భక్తిశ్రద్ధలతో మహిళలు వివిధ రకాలైన బతుకమ్మ పాటలు పాడిన తీరు అందరినీ అలరింపచేశాయి. ఈటీసీఏ కళాకా రుల బృందం పాడిన పాటలు అందరినీ అలరింపచేశాయి. కన్నుల పండుగగా జరిగిన ఈ పండుగను చూసి ఇతర దేశాలకు చెందిన విదేశీయులు సైతం మహిళలతో పాల్గొని బతుకమ్మ ఆడటం విశేషం. విదేశీయులు మన పండుగ జరుగుతున్న తీరును ఆసక్తితో తిలకిస్తూ గంటలపాటు ఫొటో కెమెరాలతో వీడియోలు బంధించడం విశేషం. ఈ సంబరాల్లో అందమైన మహిళల కోసం అందమైన బతుకమ్మల పోటీ, వాయిస్‌ ఆఫ్‌ బతుకమ్మ సింగర్స్‌, చిన్న పిల్ల సంప్రదాయ దుస్తుల వేషధారణ, పాల్గొన్న అందరికోసం లక్కీడీప్‌ పోటీలను నిర్వహించి విజేతలకు ఈటీసీఏ బహుమతులు అందజే సింది. అనంతరం ముఖ్య అతిథి రాణిరుద్రమ మాట్లాడుతూ నిజం గా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ దుబాయిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన ప్రజలని ఐకమత్యంతో ఒకటి చేస్తున్న ఈటీసీఏ కృషిని కార్యక్రమాలను, సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు.
కార్యక్రమానికి హాజరైన వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న మన ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పడుతున్న తపనను నిర్వహిస్తున్న సంఘీభావ కార్యక్రమాలను అభినందిం చారు. ఈటీసీఏ వ్యవస్థాపకులు పీచర కిరణ్‌కుమార్‌ గారు మాటా ్లడుతూ గత 2 సంవత్సరాలుగా చేస్తున్న విజయవంతమైన కార్యక్ర మాలకు చేయూతనిస్తున్న ఈసీటీఏ అభివృద్ధికి తోడ్పడుతున్న స్పాన్స ర్‌కు సంఘం మొదటగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంతకుముం దు జరిగిన కార్యక్రమాలకు మరియు ఇకముందు జరగబోయే కార్యక్రమాలకు ఆర్థికంగా వెన్నంటి ఉండి దుబాయ్‌లోని తెలంగా ణకు చెందిన పలు వ్యాపార సంస్థల యజమానులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే 2 మాసాల్లో తెలంగాణ ధూం తడాక పేరుతో 5000 మంది ప్రవాస తెలంగాణీయులతో ఒక మ్యూజికల్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామని తెలిపారు.

బతుకమ్మ పండుగ లో పాల్గొనడానికి వచ్చి ఇబ్బందిలో ఉన్న కొంతమంది తమ బాధను చెప్పుకోగా వారికి అప్పటికప్పుడే ఆర్థిక సహాయాన్ని అందజేసి టికెట్‌ ఇప్పిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న అంద రికీ ఈసీటీఏ బతుకమ్మ ప్రసాదం, అల్పాహారం పంపిణీ చేశారు. చివరగా బతుకమ్మలను తలపైన పట్టుకొని పార్క్‌ నుంచి పాటలు పాడుతూ అదే పార్క్‌లో ఉన్న సముద్రతీరానికి వెళ్లి బతుకమ్మలను వెళ్లిరావమ్మా అంటూ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పీచర కిరణ్‌కుమార్‌, మిరియాల రాజ్‌పాల్‌రావు, కొండం అశోక్‌రెడ్డి, మంచుకొండ వెంకటేశ్వర్లు, మామిడి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌.సత్యం, జయచం దర్‌రావు, మ్యాదం మహేశ్వర్‌, పీచర వెంకటేశ్వర్‌రావు, చింతం రాజమల్లు, గడ్డం గంగాధర్‌, శ్యాంరెడ్డి, మల్లయ్య, గాంధారి సత్య నారాయణ, లింగారెడ్డి, కొండ శ్రీనివాస్‌, సంపత్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు.