దుర్గామాతకు మహిళలు ఘనంగా కుంకుమ పూజలు

మహా అన్నదాన కార్యక్రమం
హుజూర్ నగర్ అక్టోబర్ 2 (జనం సాక్షి): దేవి‌ నవరాత్రులను పురస్కారించుకుని ఆదివారం
హుజూర్‌నగర్ పట్టణంలోని 24 వార్డులో విజయదుర్గా దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, సీతారాం నగర్ లో జరిగిన కార్యక్రమాలలో వేర్వేరుగా దుర్గామాతకు మహిళలు కుంకమ అర్చనతో ఘనంగా పూజలు‌ నిర్వహించారు. అనంతరం జరిగిన మహా అన్నదాన కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ గుంజ భవాని, వార్డు అధ్యక్షులు యడ్ల విజయ్ లు ప్రారంభించారు. ఈ‌ సందర్భంగా కౌన్సిలర్ గుంజ భవాని మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో అందరికి మంచి జరగాలని, వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు యడ్ల విజయ్, వెన్నం శ్రీను, ఓర్సు వెంకన్న, మేరే సైదులు, పెద్ది పుష్ప , శిరంశెట్టి నాగమణి , విజయరెడ్డి, గూడెపు వెంకన్న, పిట్టల వెంకటేశ్వరరావు, ములకలపల్లి రాము, తోట కృష్ణ, ఉపేందర్, సైదులు, నరసింహారావు, సుధీర్, ఉత్సవ కమిటి సభ్యులు, అధిక‌ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.