*దుర్గా నవరాత్రుల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*
మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 20
(జనం సాక్షి)
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి , దుర్గ నవరాత్రుల కొరకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే , చెన్నకేశవ ఆలయంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని, అలాగే పట్టణంలో దుర్గా నవరాత్రుల ఉత్సవాల గురించి, ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని, ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, దుర్గా నవరాత్రులు వైభవంగా జరపాలని ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ , మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు , చెన్నకేశవ ఆలయ కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు