దుర్గ దేవి అమ్మవారిని దర్శించుకున్న మంజులరెడ్డి
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 01(జనంసాక్షి) హుస్నాబాద్ గాంధీ చౌరస్తా లో గాంధీ చౌక్ యూత్ సభ్యులు, కాలనీ వాసులు ఆహ్వానం మేరకు ఈరోజు దుర్గమాత మండపానికి విచ్చేసిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి కి గాంధీ యూత్ సభ్యులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.అనంతరం అమ్మ వారిని దర్శించుకుని,కుంకుమ పూజలో పాల్గొన్న 108 మహిళలకి చీరలు అందచేశారు..అనంతరం మహా అన్నధాన కార్యక్రమంలో పాల్గొన్నారు.అమ్మవారి దయతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మహిళలు మంజులరెడ్డి ని శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,గాంధీ చౌక్ యూత్ సభ్యులు,మహిళలు,కాలనీ వాసులు, పట్టణ ప్రజలు, మంజులక్క యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.