దులేలో హత్య కేసులో 23మంది కస్టడీ

ముంబయి,జూలై 2(జ‌నం సాక్షి): మహారాష్ట్రలోని దులేలో జరిగిన ఐదుగురు వ్యక్తుల హత్య కేసులో సోమవారం పోలీసులు 23 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. సోలాపూర్‌లోని మంగళ్వేదే తెహసిలో ఖావ్‌ గ్రామం నుండి వచ్చిన భరత్‌ శంకర్‌ భోసలే (45), ఆయన సోదరుడు దాదరావ్‌ శంకర్‌ భోంస్లే, రాజు భోసలే, భారత్‌ మాల్వే (47), మంగళ్వేవ్లోని మనేవాడి గ్రామంలో ఉన్న అనాగ్‌ ఇంగోలేలను పిల్లల కిడ్నాపర్లుగా భావించి సాక్రీ తెహసిల్‌లోని గ్రామస్తులు దాడి చేయగా వారు మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం రెయిన్‌పాదా కుగ్రామంలో కూడా అప్రత్తమైన చర్యలు కొనసాగాయి. చనిపోయిన వారి బంధువులు వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరించారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటన జరిగిన అనంతరం ఎటువంటి ప్రభుత్వాధికారులు తమను కలవలేదని, నష్టపరిహారం, న్యాయం కావాలని దాదారావ్‌ భోసలే కుమారుడు సంతోష్‌ తెలిపారు. జిల్లాను సందర్శించిన హౌం (గ్రావిూణ) శాఖ సహాయ మంత్రి దీపక్‌ కేసర్కర్‌, నిందితులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. సోషల్‌ విూడియాలో వస్తున్న పోస్టులు నమ్మవద్దునని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పేర్కొన్నారు. ఈ ఘటనను మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అశోక్‌ చవాన్‌ ఖండిస్తూ, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ¬ం శాఖ రాష్ట్రంలో విఫలమైందని ఆరోపించారు.