దూరవిద్య బీఈడీ కోర్సులు
వరంగల్, జనవరి 19 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యా కేంద్రం బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులుగా ఉండి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల 19నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు దూర విద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ డి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. 19న ఫిజికల్ సైన్, మ్యాథమెటిక్స్ మెథడాలజీ, 22న బయోలజికల్ సైన్స్ మెథడాలజీ, 23న సోషల్ స్టడీస్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఆయా సబెక్టుల మెథడాలజీలో మొత్తం 500సీట్లున్నాయని, దూర విద్యాకేంద్రం, ఎల్‌బీ కాలేజీ, ఖమ్మం, పెద్దపల్లి, నిర్మల్ సెంటర్ లలో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.