దూసుకుపోతున్న షరపోవా

మెల్ బోర్న్:ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-3,6-2 తేడాతో ఎగునీ బౌచర్డ్ పై విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది.  ప్రత్యర్థలను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఈ టోర్నీలో ఆకట్టుకుంటున్న షరపోవా వరుస రెండు సెట్లను కైవశం చేసుకుని తన తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఒకానొక దశలో షరపోవా సంధించిన ఏస్ లకు బౌచర్డ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.