దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ జేడీఏ
వరంగల్, ఆత్మకూరు: మండలంలోని దామెర గ్రామంలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను సోమవారం ఉదయం వ్యవసాయ శాఖ జేడీఏ నాగేశ్వర్‌రావు పరిశీలించారు. నేలమట్టమైన మొక్కజొన్న పంటను పరిశీలించి నష్టం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట పరకాల ఏడీఏ గంగారామ్, ఏవో మల్లేశం తదితర అధికారులు ఉన్నారు.