దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు మహా సరస్వతి దేవిగా అవతారం
కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి కొండమల్లేపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఏడవ రోజు మహా సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు మహా సరస్వతి దేవి అవతారం సకల విద్యార్థులకు కలలకు సకల జ్ఞానానికి సరస్వతీమాత చిన్హం హంస వాహినిగా వీణ వాణిగా సరస్వతి దేవిని కొలుస్తుంటారు ఇక స్కందుడు అంటే కుమారస్వామి తల్లిగా పద్మాసనంలో విరాజిల్లే రూపంగా దర్శనమిచ్చే అవతారం స్కందమాత ఈ తల్లికి కమలాసనంపై శ్వేత పద్మంలో విరాజిల్లుతుంది తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా కాపాడుతుంది చేతులతో చెరకు గడ విల్లు పాశంకుషాలు ధరించి కుడి ఎడమ వైపులలో లక్ష్మీ సరస్వతి దేవి లను కలిగి ఉండి సకల లోకాలకు మాతృ స్వరూపంలో దర్శనమిస్తుంది ఏడవ రోజు మహా సరస్వతి దేవి అవతారం కావున పసిపిల్లలచే సరస్వతి పూజ చేయించడం జరుగుతుంది యువతులు మహిళలకు హారతి చిన్నారులచే పూజ చేయడం జరుగుతుంది పూజా కార్యక్రమంలో కండె సౌమ్య, కండె మమత, బూరుగు పద్మ, నీలా ఉదయ, బెలిజ నీరజ, గౌరు హారతి, చెట్లపల్లి శ్వేత, శోభా లక్ష్మి, కామిశెట్టి భాగ్యలక్ష్మి,వాసా నీరజ ల చేతులచే చిన్నపిల్లలకు సరస్వతి పూజ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పూరే జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా ధనుంజయ, ఉపాధ్యక్షులు అంకిశెట్టి శేఖర్, నీలా లక్ష్మయ్య, నేలంటి వెంకటేశ్వర్లు, బచ్చు వెంకటేశ్వర్లు, చెట్లపల్లి శ్రీనివాస్, పంపాటి శ్రీధర్, హెచ్చ శ్రీరాములు, బండారు రాము, సముద్రాల శ్రీనివాస్, కామిశెట్టి నరేందర్, నాళ్ల శేఖర్, పోలా శ్రీనివాస్, బూరుగు కుమార్, బూరుగు సాయి తదితరులు పాల్గొన్నారు