దేవునిగుడి అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం
పెన్ పహాడ్ అక్టోబర్ 12 (జనం సాక్షి): దేవునిగుడి అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని గ్రామ సర్పంచ్ బొల్లక సైదమ్మ బొబ్బయ్య అన్నారు బుధవారం మండల పరిధిలోని మాచారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం కు అదే గ్రామానికి చెందిన న్యాయవాది అదనపు పీపీ గ్రంధి వెంకటేశ్వర్లు- పుష్పావతి దంపతులు 300,000/- మూడు లక్షల రూపాయలు విరాళంగా నిర్వాహకులకు అందజేశారు ఈ సందర్భమున ఆయన మాట్లాడుతూ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర దేవాలయ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కోరారు ఈ కార్యక్రమంలో బోల్లక బొబ్బయ్య, ఉపసర్పంచ్ భూక్య నాగయ్య వార్డు సభ్యులు పేరు మధు నాయకులు దేశగాని జానయ్య,భూక్యా చిత్రంజన్, నగేష్,బోలక సోమయ్య, బోల్లక. సౌడయ్య తదితరులు పాల్గొన్నారు.