దేశంలోనే అత్యుత్తమ పాలన అందించిన ఘనత కెసిఆర్‌ది

ప్రజల్లో ఆయనకు చెక్కుచెదరని అభిమానం
మళ్లీ కెసిఆర్‌ సిఎం కావాలని కోరుకుంటున్నారు: కొప్పుల
ధర్మపురి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేసిఆర్‌ దేశ ప్రజలందరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపాడని మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కాంగ్రెస్‌ విమర్శలను తట్టుకోలేకే ఎన్నికలకు సవాల్‌ విసిరారని అన్నారు. కానీ ఇప్పుడేమో ముందస్తు ఎందుకంటూ వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీలు పోత్తుపెట్టుకొని పోటీచేసే దిక్కుమాలిన పరిస్థితికి దిగజారయన్నారు. రాష్ట్రంలో 70శాతానికి పైగా మళ్లీ కేసీఆర్‌ నాయకత్వానే కోరుకుంటున్నారన్నారు.కాంగ్రేస్‌ 60ఏళ్ల పాలనలో చేయని అభివృద్ధిని నాలుగున్నర కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ సారథ్యంలో చేసి చూపించారన్నారు. తన ప్రచారంలో ప్రజల్లో కెసిఆర్‌ పట్ల చెక్కుచెదరని అభిమనం కనిపిస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను చూసి రాష్ట్రం మొత్తం అభినందిస్తోందని, రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. అదే విధంగా వ్యవసాయ రంగం ఇబ్బందికర పరిస్ధితుల్లో ఉన్నప్పుడు
వ్యవసాయరంగానికి దశాదిశా నిర్ధేశం చూపిన మ¬న్నత వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు.  రైతు కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించేందుకు ఒక్కో రైతుకు ప్రభుత్వం రూ.2271 చెల్లిస్తోందన్నారు.
తెలంగాణ ఏర్పడితే చీకట్లు తప్పవన్న వారి తలలు దిమ్మతిరిగేలా నిరంతర కరెంట్‌ ఇస్తూ,  సీఎం కేసీఆర్‌ రైతులు బాగుండాలని 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించారన్నారు. అనతికాలంలో సాధించిన అభివృద్ధి పనులు భవిష్యత్తులో గిన్నిస్‌ రికార్డును కూడా కైవసం చేసుకోవచ్చని పేర్కోన్నారు.