దేశంలోనే ఎక్కడ లేని విదంగా తెలంగాణలో ఆసరా
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జుక్కల్, సెప్టెంబర్1,జనంసాక్షి,
దేశంలోనే ఎక్కడ లేనివిదంగా తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదిక మొత్తంలో ఆసరా పింఛన్లు ఇస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కొత్తగా మంజరయిన ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్దులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు ,చేనేత, గీతకార్మికులకు, హెచ్ ఐ వి ,బోధకాలు రోగులకు 2016 రూపాయలు, వికలాంగులకు 3016 రూపాయలు పించన్ ఇస్తున్నామని తెలిపారు.దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తం డబ్బులు పించన్ గా ఇస్తలేరని ఎమ్మెల్యే అన్నారు. ఎక్కువ మంది లబ్దిదారులకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కూడా మనదేనని ఎమ్మెల్యే తెలిపారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తెలంగాణా లో పుట్టక పోతిమని బాధపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కేసీఆర్ దేశ ప్రధాని అయితే ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ దేశమంతట అమలవుతాయని దేశ ప్రజలు ఆశిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న కేసీఆర్ మన తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలందరి అదృష్టమనిఎమ్మెల్యే తెలిపారు. కాగా కొత్తపింఛన్ కార్యక్రమం పండుగలా జరిగింది.మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు బాజా బజంత్రీలతో ఆడుతూ పాడుతూ మండలకేంద్రంలోని సభాస్థలికి చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి యశోద నీలుపాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయగౌడ్, సింగిల్ విండో చైర్మన్ శివానంద్ ,నాయకులు మాధవ్ రావ్ దేశాయ్, మనోజ్ పాటిల్,బొల్లి గంగాధర్,అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.