దేశంలోనే గౌరవప్రదమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం
మోమిన్ పేట సెప్టెంబర్ 1( జనం సాక్షి)
దేశంలో గౌరవప్రదమైన సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చేవెళ్ల ఎంపీ*డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి* మరియు వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు గురువారం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్ హాల్ లో మోమిన్ పేట్ మండలానికి చెందిన 1351 మంది లబ్ధిదారులకు మంజూరైన *ఆసరా పెన్షన్ కార్డులు* పంపిణి చేశారు. దేశంలో ఎక్కడ లేని విదంగా మన ముఖ్యమంత్రి *కెసిఆర్*తెలంగాణ పేద ప్రజలకు గౌరవప్రదమైన ఆసరా పెన్షన్ లు అందిస్తున్నారన్నారు. గతంలో ఉన్న సంక్షేమాన్ని స్వరాష్ట్ర తెలంగాణలో పది రెట్లు పెంచి గౌరవప్రదంగా నేరుగా లబ్ధిదారులకె ఇస్తున్నారన్నారుపేద ప్రజలకు తోడుగా ఆసరాగా నిలుస్తూ… వృద్ధాప్య మరియు వితంతులకు 2016/-, వికలాంగులకు 3016/- రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ ఎంపీపీ వసంత వెంకట్ మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరి శంకర్ ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ ఎంపీడీవో శైలజ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.