దేశంలో అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం.

కాంగ్రెస్ పార్టీ సేవలు దేశానికి ఎంతో అవసరం.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలి.
వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీ రామ్ మోహన్ రెడ్డి.
తాండూరు అగస్టు (జనంసాక్షి)దేశంలో అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీ రామ్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమం లో మహనీయుల త్యాగాలను , కాంగ్రెస్ పార్టీ  పోరాటాన్ని గుర్తుచేసుకుంటు ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు అజాధిక గౌరవ్ యాత్ర పేరట వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీ రామ్ మోహన్ రెడ్డి అధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర లో భాగంగా మంగళవారం తాండూర్ పట్టణం నుండీ మొదటి రోజు పాదయాత్ర ప్రారంభించారు.
తాండూరు పట్టణం నుండి ప్రారంభమైన పాదయాత్ర లక్ష్మీ నారాయణ పూర్ చౌరస్తా లో
జేండాను ఎగరవేసి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిరుపేదలకు సముచిత న్యాయం జరిగిందని గుర్తు చేశారు .రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో తాండూర్ పట్టణ అధ్యక్షులు మున్సిపల్  ప్రభాకర్ గౌడ్ మరియు రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు మరియు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు అయ్యుబ్ ఆన్సరి , పెద్దేముల్ జెడ్పీటీసీ ధార సింగ్ , యూత్ కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పుడురు పిఎసిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలిం , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి , ఎస్సి సెల్ రాష్ట వైస్ చైర్మన్ హేమంత్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు , పార్టీ మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ , ఎన్ ఎస్ యూ ఐ నాయకులు ,మహిళ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, ఎన్ ఎస్ యూ ఐ టౌన్ ప్రెసిడెంట్ జోగుల ఎబినేజార్, బాతుల వెంకట్, బాతుల బీంశంకర్ , బంటు వేణు గోపాల్ , ఖ య్యుం సమ్మధ్ , జలాల్ , జావేద్, రియాజ్ , అమెర్ అబ్దుల్లా , తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు