దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలోనే సాధ్యం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు శనివారం పూడూరు మండలం నిజాంపేట మేడిపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిగి శాసనసభ్యులు మహేశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని ఆమె అన్నారు. గ్రామాల్లో ప్రజలు తీసుకున్న నిర్ణయాల మేరకు పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో లేని విధంగా ప్రతి గ్రామపంచాయతీకి కేటాయిస్తున్న నిధుల కేటాయింపుతో గ్రామాలకు అవసరమైన పనులు చేసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటికీ మేడిపల్లి గ్రామానికి 70 లక్షల రూపాయలు గ్రామపంచాయతీ నిధులు వచ్చాయని వాటి ద్వారా గ్రామానికి సంబంధించి పనులను చేపట్టడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఒకప్పుడు గ్రామాలు చెత్తతో నిండి ఉండేవని అలాంటిది ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తడి, పొడి చెత్తను వేరుగా చేసి డంపింగ్ యార్డులకు చెత్తను చేరవేసేందుకు ట్రాక్టర్లను అందించడం జరిగిందని మంత్రి అన్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని తెలిపారు. గతంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ పొలాల దగ్గర సమాధి చేసే వారని, పొలాలు లేనివారు స్మశాన వాటికకు కేటాయించిన స్థలాల్లో సమాధి చేసే వారని తెలుపుతూ.. ప్రతి మనిషికి తన చివరి మజిలీలో అంత్యక్రియలు గౌరవప్రదంగా చేయాలన్న సదుద్దేశంతో కులాలకు అతీతంగా అన్ని సౌకర్యాలతో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులను ఆదుకునేందుకు వీలుగా రైతు బంధు పథకం కింద ఎకరానికి 10 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. అకాలంగా రైతులు మరణించినట్లయితే ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఐదు లక్షల నష్టపరిహారాన్ని అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆడపిల్ల వివాహం నిమిత్తం తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పథకం కింద వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మేడిపల్లి గ్రామానికి చెందిన 25 మందికి కళ్యాణ లక్ష్మి పథకం కింద వారి ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి వీలుగా పాఠశాలలో ఆంగ్లంలో బోధన చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు 26 వేల పాఠశాలల్లో 9 వేల కోట్ల ఖర్చును వెచ్చించి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది మంత్రి అన్నారు.
ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం భావించకూడదు అన్న ఉద్దేశంతో ఆశా వర్కర్ లను ప్రతి ఇంటికి సందర్శించి వివిధ పరీక్షల నిర్వహించాలని ప్రభుత్వం సూచించడం జరిగింది. బీపీ షుగర్ ఉన్నవారికి ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.చిట్టంపల్లి నుండి మేడిపల్లి గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి మంజూరు కు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. అనంతరం పరిగి శాసనసభ్యులు మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పల్లెలు కూడా పట్టణాలుగా తీర్చిదిద్దు కోవడం జరుగుతుందని అన్నారు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో చెత్తను రోడ్డుపైన వేయకుండా ఉండడంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటుంది అని అన్నారు హరితహారం లో భాగంగా గ్రామాలన్నీ పచ్చదనంతో నిండిపోతున్నాయి అంటారు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలు స్థలం కేటాయించడం జరుగుతుందని ఆయన అన్నారు. చిట్టంపల్లి నుండి మేడిపల్లి గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి మంజూరు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో పూడూరు ఎంపీపీ మల్లేశం,వైఎస్ ఎంపిపి మహిపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పెంటమ్మ, ఉప సర్పంచ్ బిజానీబి, ఇంచార్జి డిఆర్ఓ విజయ కుమారి, డిపిఓ మల్లారెడ్డి , పంచాయతీరాజ్ ఇఇ శ్రీనివాస్ రెడ్డి , గిరిజన అభివృద్ధి శాఖ అధికారి సుధారాణి , ఎంపిడిఓ ఉమా రాణి లు పాల్గొన్నారు.
ఫోటోలు.
1. నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి.
2.సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి.
3. సమావేశానికి హాజరైన నాయకులు అధికారులు
3 Attachments
|